థమన్ కు బాలకృష్ణ ఖరీదైన కారు గిఫ్ట్.. దాని ధర ఎంతో తెలుసా?
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కొన్నాళ్లుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో భారీ చిత్రాలకు ఆయనే దర్శకుడు అనేది తెలిసిందే. ఎక్కడా మ్యూజిక్ గట్టిగా వినిపిస్తుందంటే.. అది మనోడి మ్యాజికల్ ఆల్బమ్ అయ్యే ఉంటుంది. ఆయన కెరీర్ లో 150పైగా చిత్రాలకు సంగీతం అందించారు. 100 శాతం సక్సెస్ ను అందుకున్నారు. ఇప్పటికీ బడా హీరోల ప్రాజెక్ట్స్ లను ఆల్మోస్ట్ థమనే లాక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ముఖ్యంగా థమన్ ఇటీవల కాలంలో నందమూరి బాలకృష్ణకు ఎంతటి సెన్సేషనల్ సాంగ్స్ ను అందిస్తున్నారో తెలిసిందే. ఊరమాస్ బీట్ తో థియేటర్లను బద్దలయ్యేలా చేస్తున్నారు.
బాలయ్యకు థమన్ వీరాభిమాని అనే విషయం తెలిసిందే. ఆయనతో థమన్ ఎంత మర్యాదగా, గౌరవంగా ఉంటారో తెలిసిందే. పలు వేదికలపైనా థమన్ బాలయ్య పై ఉన్న ప్రేమను చూపిస్తూనే వచ్చారు. ముఖ్యంగా బాలయ్యకు వరుసగా హిట్ ఆల్బమ్స్ అందిస్తూ నటసింహం పవర్ ను చూపిస్తున్నారు. ఇక బాలయ్య కూడా థమన్ ను ఎంతో దగ్గర చేస్తుంటారు. ఆ మధ్య దేవీశ్రీ అంటే మీకు ఇష్టమా? థమన్ అంటే మీకు ఇష్టమా? అనే ప్రశ్నకు థమన్ అంటేనే తనకు బాగా ఇష్టమని బాలకృష్ణ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ముక్కుసూటిగా మాట్లాడే బాలయ్య ఆ మాటను నిలబెట్టుకున్నారు.

ఊరికనే మాటలు చెప్పి మానేయకుండా... థమన్ పై ఉన్న ప్రేమను చూపించారు. థమన్ కు ఏకంగా ఖరీదైన కారును బహూకరించాడు బాలయ్య. ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా ప్రోగ్రామ్ జరిగిన రోజే కారును అందించారు. ఈ విషయాన్ని థమన్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడా కారు ధర ఎంత అనేది నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారింది. బాలయ్య థమన్ కు ఇచ్చింది పోర్షే బ్రాండ్ కు చెందిన ఖరీదైన కారు.
2025 Porsche Cayenne ఖరీదు అక్షరాల రూ.కోటీ యాబై లక్షల నుంచి రూ.2 కోట్ల మధ్యలో ఉంటుంది. ఇది కేవలం న్యూఢిల్లీలోని రోడ్ ప్రైజ్. ఇతర ఫీచర్స్ ను కారుకు యాడ్ చేస్తే మరింత ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. అటుఇటుగా థమన్ కు రూ.2 కోట్ల గిఫ్ట్ ఇవ్వడం పట్ల అభిమానులంతా షాక్ అయ్యారు. ఇటీవల కాలంలో, ఆయన కెరీర్ లో కూడా ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఎవరికీ ఇచ్చి ఉండరని అంటున్నారు. ఇక బాలయ్య తనకు నచ్చిన వాళ్లకు ఇలా బహుమతులు ఇచ్చి సర్ ప్రైజ్ చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే థమన్ ను సర్ ప్రైజ్ చేశారు.
అలాగే.. థమన్ కూడా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ విజయవాడలో ఫిబ్రవరి 15న నిర్వహించిన ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ ను విజయవంతం చేశారు. లైవ్ పెర్ఫామెన్స్ అందించి అక్కడికి వచ్చిన గెస్ట్ లను ఆకట్టుకున్నారు. థమన్ కెరీర్ లో నుంచి వచ్చిన బెస్ట్ మ్యూజిక్ ను మాషుప్ లా వినిపించారు. ఈ సందర్భంగా సంగీత ప్రియులకు థమన్ మరోసారి కిక్కిచ్చేలా లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరై మాట్లాడారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలను గుర్తించి రూ.50 లక్షలు విరాళం అందించారు.


Click it and Unblock the Notifications











