twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NBK107 Title:బాలకృష్ణ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్.. 'సింహా' సెంటిమెంట్ కలిసొచ్చేలా..

    |

    నందమూరి నటసింహం బాలకృష్ణ మళ్లీ బాక్సాఫీస్ పై వేటకు సిద్ధమయ్యాడు. ఇటీవల అఖండ మూవీతో సాలిడ్ హిట్ కొట్టిన బాలయ్య బాబు మరో పవర్ ఫుల్ టైటిల్ తో ముందుకు రానున్నాడు. క్రాక్ చిత్రంతో సూపర్ సక్సెస్ సాధించిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటివరకు NBK107గానే పిలుచుకున్నారు. తాజాగా ఈ చిత్రానికి పెట్టిన పేరును రివీల్ చేసింది మూవీ యూనిట్. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ టైటిల్ వివరాల్లోకి వెళితే..

    ఎలాంటి టైటిల్ పెడతారోనని..

    ఎలాంటి టైటిల్ పెడతారోనని..

    డిజిటల్ తెరపై హోస్ట్ గా అలరిస్తోన్న నందమూరి బాలకృష్ణ మరోవైపు దూకుడుగా సినిమాలు చేస్తున్నాడు. మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనే దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం NBK107. ఇటీవల ఇటు బాలకృష్ణ అఖండ సినిమాతో, అటు గోపిచంద్ మలినేని క్రాక్ మూవీతో మంచి జోష్ మీదున్నారు. ఇక వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందనే టాపిక్ రాగానే నందమూరి అభిమానులు, మాస్ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల షూటింగ్ స్పాట్ పిక్స్, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఇక ఈ మూవీకి ఎలాంటి టైటిల్ పెడతారో అని చాల మందిలో క్యూరియాసిటీ నెలకొంది.

    బ్లాక్ షర్ట్ లో లుంగీ ధరించి..

    బ్లాక్ షర్ట్ లో లుంగీ ధరించి..

    వారి ఆత్రుతకు తగినట్లుగా తాజాగా ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు. బాలకృష్ణ 107వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు 'వీర సింహారెడ్డి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ టైటిల్ లాంచ్ ను కర్నూలులోని కొండారెడ్డి బురుజు దగ్గర అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. ఈ టైటిల్ పోస్టర్ లో బాలకృష్ణ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. బ్లాక్ షర్ట్ లో లుంగీ ధరించి, సన్ గ్లాసెస్ తో స్టైలిష్ గా ఉన్నాడు. పులిచర్లకు 4 కి.మీ. అనే మైలురాయిపై కాలు వేసి చేతిలో కత్తితో దర్జా నిల్చున్నాడు. ఈ టైటిల్ లోగోలో గర్జించే సింహం ఉంది. అలాగే ఈ మూవీకి ' మ్యాన్ ఆఫ్ మాసెస్' అని క్యాప్షన్ ఇచ్చారు.

     సింహా సెంటిమెంట్..

    సింహా సెంటిమెంట్..

    అయితే నందమూరి బాలకృష్ణ సినిమాల్లో ఎక్కువగా సింహా అనే పేరు ఉంటుంది. అలా ఉన్న సినిమాలన్నీ బాలయ్య బాబుకు సక్సెస్ తీసుకొచ్చాయి. సమర సింహారెడ్డి, నరసింహా నాయుడు, లక్ష్మీ నరసింహా, సింహా, జై సింహా, బొబ్బిలి సింహా సినిమాలు సూపర్ హిట్ కొట్టాయి. ఇక ఇప్పుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీకి టైటిల్ లో కూడా సింహా అని ఉండటంతో కచ్చితంగా ఈ సినిమా కూడా సూపర్ హిట్ కొడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటించగా, విజయ్ దునియా, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. అలాగే ఎస్ థమన్ సంగీతం అందించాడు.

    English summary
    Nandamuri Balakrishna And Gopichand Malineni Combination Movie NBK 107 Title Is Veera Simha Reddy Launched At Kondareddy Buruju In Kurnool
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X