హరిహర వీరమల్లులో బాలకృష్ణ.. హిస్టారికల్ పాత్రలో మరోసారి నందమూరి హీరో
పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు చిత్రం పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శితమైంది. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు, సినీ ప్రియులు ఈ సినిమాను చూశారు. కాగా సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్ సినిమాను చూసి తన ఫస్ట్ రివ్యూను అందించారు. సినిమాలోని అసలైన సర్ ప్రైజ్ ను రివీల్ చేశారు. ఇంతకీ బాలకృష్ణ ఏ పాత్రలో అతిథిగా వచ్చారనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..
భారీ బడ్జెట్ తో హరిహర వీరమల్లు..
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రానికి తొలుత క్రిష్ దర్శకత్వం వహించారు. ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో ఏఎం జ్యోతికృష్ణ ఆ తర్వాత దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం తన సొంత బ్యానర్ మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్లో రూ.250 కోట్లతో నిర్మించారు. చిత్రంలో భారీ తారాగణంతో పాటు టాప్ టెక్నీషియన్లు, భారీ ప్రమోషన్స్ కారణంగా ఈ సినిమాకు ఆ రేంజ్ లో ఖర్చైందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

భారీ స్థాయిలో రిలీజ్..
ఇక హరి హర వీరమల్లు చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు మేకర్స్. తొలిసారిగా పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా చిత్రంగా హరి హర వీరమల్లు విడుదల అవుతోంది. ఇండియాతో పాటు నార్త్ అమెరికా, యూకే, సౌత్ ఆఫ్రికాలో గ్రాండ్ గా ప్రీమియర్ ప్రదర్శితమైంది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ నే కాకుండా బ్లాక్ బాస్టర్ టాక్ ను కూడా ఓవర్సీస్ ఆడియెన్స్ అందిస్తుండటం విశేషం.
సర్ ప్రైజ్ ఎలిమెంట్ గా బాలకృష్ణ రోల్..
కాగా, తాజాగా సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ నా అన్వేషణ అన్వేశ్ హరి హర వీరమల్లు చిత్రంపై ఇంట్రెస్టింగ్ రివ్యూ ఇచ్చారు. సౌత్ ఆఫ్రికాలో తను సినిమాను చూశానని చెప్పారు. సినిమాలో అసలైన ట్విస్ట్ ఉందని, ఎవ్వరూ ఊహించలేరని రివీల్ చేశారు. నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో హిస్టారికల్ పాత్రలో అలరించారని చెప్పారు. వీరమల్లు మనవడిగా బాలకృష్ణ గెస్ట్ పాత్రను గూస్ బంప్స్ వచ్చేలా సెట్ చేశారని చెప్పడం విశేషం. తన వరకు సినిమా పక్కా బ్లాక్ బాస్టర్ అని చెప్పారు. పవన్ కళ్యాణ్ కెరీయర్ లో ఇదే బెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకొచ్చారు.
ఇక హరి హర వీరమల్లు చిత్రం ఇండియాలో జూలై 24న విడుదల కాబోతోంది. జూలై 23న పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శితం కానున్నాయి. ఇప్పటికే అన్నీ థియేటర్ల వద్ద హరి హర వీరమల్లు వైబ్ కనిపిస్తోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్రను పోషించడం విశేషం. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఇక పవన్ కళ్యాణ్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ డే రెస్పాన్స్, బాక్సాఫీస్ నెంబర్లపై ఇప్పుడు అందరిలో ఆసక్తిని నెలకొల్పింది. పవన్ కళ్యాణ్ కెరీయర్ లోనే ఈ చిత్రానికి అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతుండటం విశేషం.


Click it and Unblock the Notifications











