Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మోక్షజ్ఞపై ట్రోలింగ్.. అప్పట్లో ఎన్టీఆర్ కూడా అంతేగా.. ముందే పసిగట్టిన బాలకృష్ణ
టాలీవుడ్ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కోసం వారి కుటుంబ సభ్యులు ఏ స్థాయిలో ఎదురుచూస్తారో తెలియదు గాని అభిమానుల్లో మాత్రం అంచనాల డోస్ ఊహించని విధంగా ఉంటుంది. గత కొంత కాలంగా మోక్షజ్ఞ ఎంట్రీపై పలు రకాల రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే సడన్ గా మోక్షజ్ఞ లుక్స్ పై ట్రోలింగ్ నడవడం ఓ వర్గం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. అలా జరుగుతుందని బాలయ్యకు ముందే తెలుసట.
షాకిచ్చిన లుక్..
ఇటీవల నందమూరి బాలకృష్ణ తన 60వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకున్న బర్త్ డే పార్టీలో మోక్షజ్ఞ కూడా ఉన్నాడు. అందుకు సంబంధించిన ఫొటోస్ బయటకు రావడంతో ఒక్కసారిగా ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఊహించని విధంగా మోక్షజ్ఞ లుక్స్ ఓ విధంగా షాక్ కి గురి చేశాయి.
ఒక క్లారిటీ అయితే వచ్చింది..
ప్రస్తుతం మోక్షజ్ఞ తేజ వయసు 25. ఇంకా సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఎక్కువ సమయం లేదు. ఈపాటికే ఫిట్నెస్ తో సిద్ధం కావాల్సింది. ఇక నటనలో డ్యాన్స్ లో ఎంతవరకు శిక్షణ తీసుకున్నాడో ఎవరికి తెలియదు. కానీ ఫొటోలు బయటకు వచ్చిన తరువాత మాత్రం ఇప్పుడైతే మోక్షజ్ఞ సిద్ధంగా లేడని ఒక క్లారిటీ వచ్చింది.
ముందే పసిగట్టారట..
ఇకపోతే మోక్షజ్ఞ ఫిట్నెస్ పై ట్రోలింగ్ గురించి బాలయ్య ముందే పసిగట్టారట. తనయుడు రాక కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ఆయనకు ఒక అవగాహన ఉంది. ఇన్నాళ్లు మోక్షజ్ఞకు సంబంధించిన ఫోటోలను అస్సలు బయటపెట్టలేదు. మీడియా కంట పడింది కూడా లేదు. అయితే ఈ సారి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యుల ఫోటోలను బయటపెట్టక తప్పలేదు.
Recommended Video
ముందు ఎన్టీఆర్ కూడా అంతేగా..
బాలకృష్ణకు ఇలా జరుగుతుందని ముందే తెలుసట. అందుకే ఎంత ట్రోలింగ్ నడిచినా కూడా ఆ విషయాలపై ఆయన స్పందించలేదు. కానీ వచ్చే రెండేళ్ల అనంతరం తప్పకుండా మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడాని ఇంటర్వ్యూలలో గట్టిగా చెప్పారు. ఇక మోక్షజ్ఞకి ఓ వర్గం నుంచి మద్దతు గట్టిగానే లభిస్తోంది. సినిమాల్లో వచ్చిన కొత్తలో ఎన్టీఆర్ కూడా బొద్దుగా ఉండేవాడని ఆ తరువాత స్లోగా మారాడు. అలాగే మోక్షజ్ఞ కూడా మారతాడాని నెటీజన్స్ కామెంట్ చేస్తున్నారు.