twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ, బోయపాటి సినిమాకు క్రేజీ టైటిల్.. ఫ్యాన్స్‌కు జూన్ 10న పండుగే

    |

    దర్శకుడు బోయపాటి శ్రీనుతో నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దమవుతున్నారు. నిర్మాత మిర్యాల రవిందర్ రెడ్డి రూపొందిస్తున్న చిత్రం కొంతమేరకు షూటింగ్ పూర్తి చేసుకొన్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా అన్ని చిత్రాలతోపాటు ఈ సినిమా షూటింగ్ కూడా నిలిచిపోయింది. అయితే లాక్‌డౌన్‌లో నిరాశలో అభిమానులకు ఉత్తేజం కలిగించేందుకు చిత్ర యూనిట్ బ్రహ్మండమైన ప్లాన్‌ను రెడీ చేసినట్టు తెలుస్తున్నది.

    జూన్ 10వ తేదీన బాలకృష్ణ 60వ జన్మదినం జరుపుకోనున్నారు. ఈ శుభ వేడుక సందర్భంగా బోయపాటి సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసినట్టు సమాచారం. అ సినిమాకు మోనార్క్ అనే పేరును ఖరారు చేసినట్టు తెలుస్తున్నది.

    Balakrishna movie title Monarch to be annouced on June 10th

    లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమా టైటిల్‌ను బాలకృష్ణ రిజిస్టర్ చేసినట్టు తెలిసింది. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ను అభిమానులతో పంచుకోవాలని సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య బర్త్ డే రోజున టైటిల్ అనౌన్స్‌మెంట్ చేయాలని నిర్ణయించుకొన్నట్టు తెలుస్తున్నది.

    మార్చి తొలివారంలో సెట్స్‌పైకి వెళ్లిన ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకొన్నది. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సంకేతాలిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీయ సరన్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలిసింది. అలాగే సంజయ్ దత్‌ విలన్ పాత్రలో కనిపించబోతున్నారనే విషయం సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

    English summary
    Balakrishna latest movie title under cosideration as Monarch. Title of the movie revealed on Balaiah birth June 10th. Director Boyapati Srinu given revealed about Balakrishna as Agora role. Boyapati Srinu said that my third movie started and completed one schedule.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X