Don't Miss!
- News Lok Sabha Election 2024 Polling LIVE Updates: అతిపెద్ద పండగకు తొలి ఘట్టం..
- Sports PBKS vs MI: తొండాటకు ముగింపు.. కెమెరా ముందు టాస్ కాయిన్ ఫలితం! వీడియో
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాలకృష్ణ, బోయపాటి సినిమాకు క్రేజీ టైటిల్.. ఫ్యాన్స్‌కు జూన్ 10న పండుగే
దర్శకుడు బోయపాటి శ్రీనుతో నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దమవుతున్నారు. నిర్మాత మిర్యాల రవిందర్ రెడ్డి రూపొందిస్తున్న చిత్రం కొంతమేరకు షూటింగ్ పూర్తి చేసుకొన్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా అన్ని చిత్రాలతోపాటు ఈ సినిమా షూటింగ్ కూడా నిలిచిపోయింది. అయితే లాక్డౌన్లో నిరాశలో అభిమానులకు ఉత్తేజం కలిగించేందుకు చిత్ర యూనిట్ బ్రహ్మండమైన ప్లాన్‌ను రెడీ చేసినట్టు తెలుస్తున్నది.
జూన్ 10వ తేదీన బాలకృష్ణ 60వ జన్మదినం జరుపుకోనున్నారు. ఈ శుభ వేడుక సందర్భంగా బోయపాటి సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసినట్టు సమాచారం. అ సినిమాకు మోనార్క్ అనే పేరును ఖరారు చేసినట్టు తెలుస్తున్నది.
లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమా టైటిల్‌ను బాలకృష్ణ రిజిస్టర్ చేసినట్టు తెలిసింది. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ను అభిమానులతో పంచుకోవాలని సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య బర్త్ డే రోజున టైటిల్ అనౌన్స్మెంట్ చేయాలని నిర్ణయించుకొన్నట్టు తెలుస్తున్నది.
మార్చి తొలివారంలో సెట్స్‌పైకి వెళ్లిన ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకొన్నది. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సంకేతాలిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీయ సరన్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలిసింది. అలాగే సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారనే విషయం సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.