Balakrishna: చిరంజీవి దర్శకుడితో బాలకృష్ణ మూవీ.. ఆరోజు ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్

నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా జోరు చూపిస్తున్నారు. వరుస పెట్టి సినిమాలతో సత్తా చాటుతున్నారు. అఖండ, వీర సింహా రెడ్డి మంచి హిట్స్ అందుకున్న ఆయన లైన్ లో అనేక సినిమాలు ఉంచారు.

మాస్ డైరెక్టర్ బోయపాటి, అనిల్ రావిపూడితో సినీ ప్రాజెక్ట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడితో బాలయ్య సినిమా చేస్తున్నాడని టాక్. అంతేకాకుండా దానికి సంబంధించిన అప్డేట్ ఆరోజు రానుంది.

Balakrishna Movie With Chiranjeevi Director Bobby And Announcement On June 10

మొదటిసారిగా: నందమూరి నటిసింహం బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న 108 సినిమా NBK108. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మొదటి సారిగా బాలయ్య బాబు తెలంగాణ భాషతో అలరించనున్నాడని టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా విడుదల తేదీని కూడా ఇటీవల ప్రకటించారు.

Balakrishna Movie With Chiranjeevi Director Bobby And Announcement On June 10

భగవత్ కేసరి టైటిల్: NBK108 చిత్రాన్ని విజయదశమి కానుకగా.. రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు. NBK108 సినిమాకు భగవత్ కేసరి అనే టైటిల్ పరీశీలిస్తున్నట్లు సినీ ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం. ఇక ఈ మూవీలో చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

Balakrishna Movie With Chiranjeevi Director Bobby And Announcement On June 10

రెండు రకాల వాదనలు: అయితే అనిల్ రావిపూడితో తరెక్కిన ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు టాక్. ఇక ఇందులో బాలకృష్ణకు జోడిగా చందమామ కాజల్ చేయగా మరో హీరోయిన్ గా బ్యూటిఫుల్ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల కూడా నటించనుంది. అయితే బాలయ్యకు శ్రీలీల మేన కోడలిగా, లేదా అన్న కూతురిగా నటించనుందని ఓ టాక్ వస్తోంది.

Balakrishna Movie With Chiranjeevi Director Bobby And Announcement On June 10

చిరంజీవి డైరెక్టర్: ఇదిలా ఉంటే అనిల్ రావిపూడితో బాలకృష్ణ చేస్తున్న 108 సినిమా తర్వాత బోయపాటితో 109 మూవీ ఉంటుందనుకున్నారు. కానీ ఇప్పుడు NBK109 మూవీ చిరంజీవికి సూపర్ హిట్ అందించిన దర్శకుడితో ఉంటుందని టాక్ వస్తోంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు కెఎస్ రవీంద్ర అలియాస్ బాబీ. ఇటీవల వాల్తేరు వీరయ్య మూవీతో బాబీ ఎలాంటి హిట్ అందుకున్నాడో తెలిసిందే.

Balakrishna Movie With Chiranjeevi Director Bobby And Announcement On June 10

ఆ రోజునే ప్రకటనలు: ఇప్పుడు బాలకృష్ణ NBK109 సినిమాను బాబీ డైరెక్ట్ చేయనున్నాడని టాక్. సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ లో బాలయ్య త్వరలో పాల్గొననున్నాడట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను బాలయ్య బర్త్ డే సందర్భంగా జూన్ 10న అనౌన్స్ చేయనున్నారట. అలాగే NBK108 టైటిల్ కూడా అదే రోజున ప్రకటిస్తూ డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X