NBK109: మారణాయుధాలు మందు బాటిల్‌తో బాలయ్య.. 'వయెలెన్స్ కి విజిటింగ్ కార్డ్' అంటూ!

నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా జోరు చూపిస్తున్నారు. వరుస పెట్టి సినిమాలతో సత్తా చాటుతున్నారు. అలాగే ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను ఒక్కొటి వదులుతున్నారు. జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా రెండు రోజుల ముందు నుంచి వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఇక ఇవాళ భగవంత్ కేసరి మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా ఆయన 109వ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.

నటసార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు బాలకృష్ణ. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలతో జోష్ చూపిస్తున్న బాలయ్య పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా రెండు రోజుల ముందు నుంచే పుట్టిన రోజు సెలబ్రేషన్స్ మొదలు కాగా ఒక్కో సినిమా నుంచి ఒక్కో అప్డేట్ ఇస్తూ అభిమానులను మేకర్స్ సంతోషపెడుతున్నారు.

NBK109:

రెండు రోజులకు ముందు బాలయ్య 108వ సినిమాకు భగవంత్ కేసరి అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. అలాగే బాలయ్యకు గ్లోబల్ లయన్ బిరుదు ఇచ్చారు. ఇక ఇవాళ అంటే జూన్ 10న భగవంత్ కేసరి మూవీ స్పెషల్ గ్లింప్స్ వదిలి నందమూరి అభిమానులకు ట్రీట్ అందించారు. ఇప్పుడు బాలకృష్ణ NBK 109 మూవి అప్డేట్ ఇచ్చారు. వాల్తేరు వీరయ్య డైరెక్టర్ కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు.

శ్రీకర స్టూడియెస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు. ఈరోజు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఓ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో సుత్తె, గొడ్డలి, కత్తులు వంటి వివిధ రకాల మారణాయుధాలతో పాటు మందు బాటిల్, డబ్బు చుట్టి ఉన్న ఉండలు ఉన్న బాక్స్ ఓపెన్ చేసి ఉంది. వయెలన్స్ కి విజిటింగ్ కార్డ్ అంటూ వదిలిన ఈ పోస్టర్ క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఈ సినిమా 2024లో రానుంది. ఇక బాలకృష్ణ NBK 109 పూజా కార్యక్రమంలో డైరెక్టర్ త్రివిక్రమ్ సందడి చేశారు. డైరెక్టర్ బాబీ, త్రివిక్రమ్, బాలకృష్ణతో దిగిన ఫొటోలు వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X