బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. మే 17 నుంచే..
శతాధిక చిత్రాల కథానాయకుడు నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో మరో చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నది. వీరిద్దరి కలయికలో వచ్చిన జై సింహ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజా చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, సికే ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సి కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
బాలయ్య తాజా చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు విలన్‌గా నటించనున్నారు. బ్లాక్‌బస్టర్ లెజెండ్ తర్వాత బాలకృష్ణ, జగపతిబాబు కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందనుంది. జై సింహకు మ్యూజిక్ అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.

బాలయ్య, కేఎస్ రవికుమార్ హిట్ కాంబినేషన్‌లో సినిమా మే 17న లాంఛనంగా ప్రారంభం అవుతుంది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సినిమాకు సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
వాస్తవానికి ఈ సినిమా కంటే ముందు బోయపాటితో బాలకృష్ణ ఓ సినిమాలో నటించాల్సింది. అయితే కథలో మార్పుల వల్ల ప్రాజెక్టు ఆలస్యం కావడంతో కేఎస్ రవికుమార్ ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది. అనంతరం బోయపాటితో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











