బాలయ్యతో హిట్టు సినిమా తీస్తే.. మోక్షజ్ఞ మొదటి సినిమాకు దర్శకుడు అతనే!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వారసులుగా ఎంట్రీ ఇవ్వడానికి చాలా మంది కుర్ర హీరోలు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఇటీవల ఒక యువ దర్శకుడితో బాలయ్య కొడుకు ఎంట్రీపై చర్చించినట్లు తెలుస్తోంది.

వారసుడు సిద్ధమయ్యాడ?
మోక్షజ్ఞ ఎప్పుడు వెండితెరపై ఎంట్రీ ఇస్తాడో గాని గత కొన్నేళ్లుగా అతనికి సంబంధించిన వార్తలు చాలానే వస్తున్నాయి. ఇప్పటికే కొంత ఆలస్యం అయ్యిందనే కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం మోక్షజ్ఞ వయసు 25 ఏళ్లు. అసలు మోక్షజ్ఞ నటుడిగా సిద్ధమయ్యాడా లేదా అనే విషయంలో బాలయ్య ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. మోక్షజ్ఞ కూడా బయట ప్రపంచంలో ఎక్కువగా కనిపించింది లేదు.

బాలయ్యతో హిట్టు కొడితే..
ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ నలుగురు దర్శకులను లైన్ లో పెట్టాడు. ముందుగా బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే అనిల్ రావిపూడితో కూడా మరో సినిమా చేయనున్నాడు. అయితే వీరిద్దరు మోక్షజ్ఞతో మొదటి సినిమా చేయాలని ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే బోయపాటితో చాలా సార్లు బాలయ్య కొడుకు ఎంట్రీ పై చర్చించారు.

హిట్టు పడితేనే..
మోక్షజ్ఞ ఎంట్రీ కోసం డైరెక్టర్ గా ఎవరు సెట్టవుతారు అనే విషయంలో బాలయ్య ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తనతో హిట్టు సినిమా తీసి ఆ తరువాత కథ చెప్పి సంతృప్తి పరచగలిగితే.. తప్పకుండా మోక్షజ్ఞ మొదటి సినిమాకు అవకాశం ఇస్తానని చెప్పారట. అందుకే ఈ దర్శకులు బాలయ్య సినిమాపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు.
Recommended Video

అనిక్ రావిపూడికే ఎక్కువ అవకాశాలు..
ఈ పోటీలో బోయపాటి శ్రీనివాస్ కంటే అనిల్ రావిపూడికే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు అనిల్ ఒక్క ప్లాప్ కూడా ఎదుర్కోలేదు. మినిమిమ్ కమర్షియల్ హిట్స్ అందుకున్న దర్శకుడిగా తనకంటూ ఒక మంచి క్రేజ్ ని అందుకున్నాడు. ఇక ఇటీవల బాలయ్యకు కొత్త కథ చెప్పి మెప్పించిన అనిల్.. మోక్షజ్ఞ కోసం కూడా సరైన కథను రాస్తున్నట్లు తెలుస్తోంది. మరి బోయపాటి బాలకృష్ణతో అనుకున్నట్టుగానే హిట్టు సినిమా తీస్తాడా అనే విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజుకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











