గోపీచంద్, బాలకృష్ణ కాంబినేషన్లో న్యూ ప్రాజెక్ట్.. మరో హై వోల్టేజ్ సినిమా
టాలీవుడ్ ఇండస్ట్రీలో కాంబినేషన్స్ అనగానే అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయికి చేరుకుంటాయి. ఇక బాలకృష్ణ లాంటి హీరోతో కమర్షియల్ మాస్ దర్శకులు కలిస్తే ఆ కాంబోపై పెరిగే అంచనాలు మామూలుగా ఉండవు. ఇక రానున్న రోజుల్లో బాలకృష్ణ వరుసగా మాస్ దర్శకులతోనే సినిమాలు చేయాలని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.
బాలయ్య నటించిన గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ను అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎలాగైనా ఈ సారి బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని బాలయ్య చాలానే కష్టపడుతున్నాడు. ఇక ఆ సినిమా తరువాత బాలకృష్ణ ఎలాంటి సినిమా చేస్తాడు అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. బి.గోపాల్, అనిల్ రావిపూడి వంటి దర్శకులు రెడీగా ఉన్నట్లు టాక్ వస్తున్నప్పటికి ఇంకా ఫైనల్ కాలేదు.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే బాగా వైరల్ అవుతోంది. క్రాక్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనీతో బాలకృష్ణ ఒక సినిమా చేయడబికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. డాన్ శీను, బలుపు, పండగ చేస్కో వంటి సినిమాలతో కమర్షియల్ దర్శకుడిగా మంచి క్రేజ్ అందుకున్న గోపిచంద్ మలినేని ఇటీవల బాలకృష్ణను స్పెషల్ గా కలిసినట్లు తెలుస్తోంది. ఒక మాస్ కథను చెప్పడంతో ఆయన పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం. త్వరలోనే ఈ కాంబినేషన్ పై బాలయ్య అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











