మహానాయకుడు ఫ్లాప్ తర్వాత ఒకే వేదికపై బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్.. నందమూరి ఫ్యాన్స్‌కు జోష్
నందమూరి అభిమానులకు శుభవార్త. నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఒకే వేదికపైన కనిపించనున్నారు. అబ్బాయి కల్యాణ్ రామ్ నటించిన 118 చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు బాలకృష్ణ రానున్నారు. అలాగే సొదరుడి సినిమాను ప్రమోట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తుండటంతో ఈ వేడుక రచ్చ రచ్చ మారే అవకాశం ఉంది. 118 ప్రీ రిలీజ్ వేడుక ఎప్పుడు? ఎక్కడంటే?

ఫిబ్రవరి 25న ప్రీరిలీజ్ ఫంక్షన్
కల్యాణ్ రామ్ నటించిన 118 చిత్రం మార్చి 1 తేదీన రిలీజ్ కానున్నది. ఈ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఫిబ్రవరి 25 తేదీన ఫిలింనగర్‌లోని జేఆర్సీ వేదిక వద్ద తలపెట్టారు.

ముఖ్య అతిథులుగా బాలకృష్ణ, ఎన్టీఆర్
118 సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథులుగా బాలకృష్ణ, ఎన్టీఆర్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి వీరిద్దరూ వస్తున్నారనే వార్త అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తోపాటు మరికొందరు సినిమా ప్రముఖులు హాజరుకానున్నారు.

నిరాశ సమయంలో ఒకే వేదికపై
ఎన్టీఆర్: మహానాయకుడు చిత్రానికి అంతగా స్పందన కనిపించకపోవడం నందమూరి అభిమానులను కొంత నిరాశపరిచింది. నిరాశ, నిస్పృహలో ఉన్న ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపడానికి నందమూరి హీరోలకు 118 సినిమా వేడుకగా మారడం మంచి పరిణామంగా మారిందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.

మార్చి 1న విడుదల
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 118 చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన షాలిని పాండే, నివేదా థామస్ నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వం వహించారు. మహేష్ కోనేరు నిర్మాత. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో రూపొందిన ‘118' చిత్రం శుక్రవారం విడుదలవుతున్నది.


Click it and Unblock the Notifications











