NBK108: బాలకృష్ణకు కూతురిగా శ్రీలీల కాదు.. అసలు పాత్ర అది.. ఒక్క పాట కోసం అన్ని కోట్లు!
నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా జోరు చూపిస్తున్నారు. వరుస పెట్టి సినిమాలతో సత్తా చాటుతున్నారు. ఇటీవల అఖండ, వీర సింహా రెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రూ. 200 కోట్ల సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య బాబు. ఇటీవలే మాస్ డైరెక్టర్ బోయపాటితో బాలయ్య ఓ సినిమా చేస్తున్నట్లు టాక్ వచ్చింది. దానికంటే ముదుగానే కామెడీ చిత్రాలకుపేరొందిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK108 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో బాలకృష్ణకు బ్యూటిఫుల్ శ్రీలీల కూతురిగా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమెకు బాలయ్య బాబు తండ్రిగా కాకుండా మరో పాత్రలో నటిస్తున్నట్లు టాక్.

డైలాగ్ టైమింగ్..
నందమూరి నటిసింహం బాలకృష్ణ, కామెడీ చిత్రాల డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 108వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాతో మొదటి సారిగా బాలయ్య బాబు తెలంగాణ భాషతో అలరించనున్నాడట. ఈ సినిమాలో బాలయ్య డైలాగ్ టైమింగ్ అద్భుతంగా ఉండనుందని సమాచారం. అలాగే ఈ సినిమాలో మంచి ఎమోషనల్ కంటెంట్ కూడా హైలెట్ కాబోతున్నట్లు ఇప్పటికే వార్తలు జోరుగా వచ్చాయి.

పోస్టర్ ద్వారా..
ఇక అనిల్ రావిపూడి NBK108 సినిమా షూటింగ్ ను కొన్ని రోజుల క్రితమే మొదలుపెట్టగా.. వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేశారు. అందుకు తగినట్లుగా ఇటీవల ఈ సినిమా విడుదల తేదిని అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. NBK108 చిత్రాన్ని విజయదశమి కానుకగా.. రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు. NBK108 సినిమాలో ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో బాలకృష్ణకు జోడిగా చందమామ కాజల్ అలరించనుంది.

బాలకృష్ణకు అన్నయ్యగా..
బాలకృష్ణ సరసన చందమామ కాజల్ చేస్తుండగా.. ఆయనకు కూతురి పాత్రలో డ్యాన్సింగ్ క్వీన్ అండ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్నట్లు ఇప్పటి వరకు అయితే టాక్ వినిపించింది. కానీ ఇందులో బాలయ్య బాబు, శ్రీలీల ఇద్దరు తండ్రీకూతుళ్లుగా చేయట్లేదని ప్రస్తుతం మరొ వార్త వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో శ్రీలీలకు బాలకృష్ణ బాబాయ్ పాత్రలో కనిపిస్తారట. ఇక శ్రీలీల తండ్రి పాత్రలో సీనియర్ నటుడు శరత్ కుమార్ నటిస్తున్నట్లు సమాచారం. అంటే ఇందులో బాలకృష్ణకు అన్నయ్య పాత్రలో శరత్ బాబు చేస్తున్నారు.

రామోజీ ఫిల్మ్ సిటీలో..
ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా డిఫరెంట్ యాక్షన్ డ్రామాగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారట. దూకుడైన మనసత్వం కల హీరోగా బాలయ్య క్యారెక్టర్ గా డిజైన్ చేశారట. ఇక శ్రీలీల, శరత్ కుమార్, హీరో మధ్య వచ్చే సీన్లు కొత్తగా ఉంటాయని సమాచారం. ఈ సినిమాకు అవి ఆయువు పట్టులాంటివట. ఇటీవలే బాలకృష్ణ, శ్రీలీల, ఇతరా పాత్రలతో కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో శ్రీలీల మీద ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.

ఏకంగా అన్ని కోట్లు..
శ్రీలీలపై చిత్రీకరిస్తున్న ఈ పాటకు మొత్తంగా రూ. 5 కోట్లు ఖర్చు అవుతోందట. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్యాచీ ట్యూన్ ఇవ్వగా.. ముంబై నుంచి ప్రత్యేకంగా డ్యాన్సర్లను రప్పించి మరి సాంగ్ ను షూట్ చేస్తున్నారని సమాచారం అందింది. సో ఇలా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీ NBK108 దసరాకు ఫుల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











