రవితేజ vs బాలకృష్ణ: నాలుగోసారి పోటీకి సిద్ధమైన స్టార్స్.. బాలయ్య ఇప్పుడైనా హిట్ కొడతాడా?
బాక్సాఫీస్ వద్ద ఒకరి తరువాత మరొకరు రికార్డులను అందుకోవడానికి రెడీగా ఉన్నారు. ఈ ఏడాది మొత్తం థియేటర్స్ చాలా వరకు హౌజ్ ఫుల్ బోర్డ్స్ తో దర్శనమిస్తాయని చెప్పవచ్చు. గత ఏడాది వచ్చిన గ్యాప్ మొత్తంను ఈ ఆరు నెలల్లోనే పవర్ఫుల్ గా ఫిల్ చేయనున్నట్లు అర్ధమవుతోంది. అయితే బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల మధ్య పోటీ తీవ్రత కూడా ఎక్కువకానుంది. మూడుసార్లు బాక్సాఫీస్ వద్ద ఫైట్ చేసిన రవితేజ, బాలకృష్ణ మరోసారి రికార్డుల కొట్లాటకు రెడీ అవుతున్నారు.

సీరియస్ గా పోటీ డోస్ పెంచుతున్నారు
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల మధ్య పోటీ చాలా వేడిగా నడిచేధి. ఎక్కువగా ఏ హీరో సినిమా థియేటర్లలో ఆడింది అనే అంశమే హైలెట్ అయ్యేది. ఇక ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలో పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే అభిమానులు చాలా సీరియస్ గా పోటీ డోస్ పెంచుతున్నారు. ఇక నెక్స్ట్ అందరిచూపు బాలకృష్ణ రవితేజ మధ్య జరగనున్న ఫైట్ పైనే ఉంది. ఖిలాడి, BB3 సినిమాలు మే 28న రానున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

మొదటిసారి..
ఎందుకంటే ఇది వరకే ఈ ఇద్దరు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. అనుకోకుండా మూడు సినిమాలు రిలీజ్ డేట్ తో క్లాష్ అయ్యాయి. మొదట 2008లో జనవరి 11న ముందుగా బాలకృష్ణ ఒక్క మగాడు సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా దారుణంగా డిజాస్టర్ అవ్వగా గ్యాప్ డే లో వచ్చిన మాస్ రాజా కృష్ణ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.

కిక్ vs మిత్రుడు
ఇక రెండవసారి 2009లో బాలకృష్ణ మిత్రుడు రిలీజ్ అవ్వగా అదే సమయంలో రవితేజ కిక్ సినిమా విడుదలయ్యింది. ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక బాలయ్య మిత్రుడు సినిమా మాత్రం బిగ్ డిజాస్టర్ అయ్యింది.

దాసరి దర్శకత్వంలో..
ఇక మూడవసారి 2011లో జనవరి 12న భారీ స్థాయిలో విడుదలైన సినిమా పరమవీరచక్ర. బాలకృష్ణ, దాసరి నారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన ఆ సినిమా అప్పట్లో భారీగా రిలీజ్ అయ్యింది. అయితే సినిమా మొదటిరోజే ప్లాప్ టాక్ ను అందుకుంది. అదే సమయానికి వచ్చిన మిరపకాయ్ మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది.
Recommended Video

బోయపాటి సినిమాతో..
ఇక ఈ సమ్మర్ లో రవితేజ ఖిలాడి సినిమా బాలకృష్ణ బోయపాటి BB3 ఒకేసారి విడుదల అవుతున్నాయి. ప్రతిసారి కూడా రవితేజనే పై చేయి సాధిస్తు వచ్చాడు. అయితే ఈ సారి హిట్ కాంబో బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఈ ఇద్దరి హీరోల్లో గెలిచేది ఎవరో తెలియాలి అంటే మే 28 వరకు వేయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











