twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవర్‌ఫుల్‌ ధర్మగా బాలక‌ృష్ట.. దద్దరిల్లిన రూలర్ మోషన్ పోస్టర్

    |

    సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హ్యాప్పీ మూవీస్ బ్యానర్‌పై నందమూరి బాలకృష్ణతో నిర్మాత సీ కల్యాణ్ నిర్మిస్తున్న చిత్రం రూలర్. ఈ సినిమాకు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా కనిపించనున్నది. దీపావళీ పండుగను పురస్కరించుకొని రూలర్ సినిమా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

    రూలర్ మోషన్ పోస్టర్‌లో బాలకృష్ణ పోలీస్ అధికారిగా కనిపించారు. చేతిలో సుత్తి పట్టుకొని ఉగ్రరూపాన్ని ప్రదర్శించారు. ఇన్స్‌పెక్టర్ ధర్మగా పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నట్టు స్పష్టమైంది. కాగా ఈ మోషన్ పోస్టర్‌లో అడుగడుగో యాక్షన్ హీరో.. అడుగడుగులో అంటూ సెల్ఫీ లేరో యారో అంటూ పాట సాగింది. మాస్ ఎలిమెంట్స్‌తో రిలీజైన ఈ మోషన్ పోస్టర్‌కు ఫ్యాన్స్‌ నుంచి విశేష స్పందన వస్తున్నది.

    Balakrishnas Ruler movie motion poster released

    కాగా రూలర్స్ చిత్రంలో వేదిక, ప్రకాశ్ రాజ్, భూమిక చావ్లా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం క్రిస్మస్, నూతన సంవత్సర కానుకగా డిసెంబర్ 20 తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నది.

    గతంలో బాలకృష్ణ, దర్శకుడు కేఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో వచ్చిన జై సింహ భారీ విజయాన్ని సొంతం చేసుకొన్న సంగతి తెలిసింది. ఆ తర్వాత మళ్లీ అదే కాంబినేషన్‌లో బాలయ్య పోలీస్ అధికారిగా బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేందుకు సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. షూటింగ్‌తోపాటు ఏకకాలంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు సమాచారం.

    English summary
    Nandamoori Balakrishna's Ruler movie motion poster released on the eve of Diwali. Film Unit tweeted that First look Motion Poster of #NandamuriBalakrishna's #Ruler 👑. Worlwide release on December 20th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X