twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య ఆన్ డ్యూటీ.. స్పెషల్ వెహికల్‌లో హిందూపూర్‌కి కోవిడ్ కిట్స్!

    |

    నందమూరి బాలకృష్ణ ఒకపక్క సినిమాల్లో రాణిస్తూనే మరోపక్క రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం తరఫున హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. రాష్ట్రమంతా జగన్ గాలి వీచినా సరే హిందూపురం నియోజకవర్గంలో మాత్రం భారీ మెజారిటీతో బాలకృష్ణ గెలుపొందారు.. అందుకే తన నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా ఆయన అక్కడి వారికి అండగా నిలబడుతూ ఉంటారు. తాజాగా బాలకృష్ణ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు.

    హిందూపురం నియోజకవర్గంలో కరోనా బారిన పడిన వారి కోసం ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో కరోనా కిట్స్ పంపించినట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసానికి దాదాపు రెండు వేల కరోనా కిట్స్ పంపారని అంటున్నారు. కోవిడ్ పాజిటివ్ ఉన్న దాదాపు రెండు వేల మందికి ఉచితంగా ఈ మందులు పంపిణీ చేస్తామని కొద్ది రోజుల క్రితం బాలకృష్ణ ప్రకటించారు. పదకొండు వందల రూపాయల ఖరీదు చేసే ఈ మెడికల్ కిట్లు దాదాపు 2000 హిందూపురానికి చేరుకోవడంతో బాలకృష్ణ నివాసం వద్ద కోవిడ్ బాధితుల బంధువులకు అందజేశారు.

    Balakrishna sent COVID-19 Medical Kits to hindupur

    కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారి ఆధార్ కార్డు, పాజిటివ్ రిపోర్ట్ చూపించి ఆ వ్యక్తి బంధువులు గాని స్నేహితులు గాని వచ్చి 14 రోజులకు సరిపడా ఉండే ఈ కిట్ ను పొందవచ్చని ఎమ్మెల్యే కార్యాలయం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇక ఇవి పూర్తిగా నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత నిధులతో ఏర్పాటు చేసిన కిట్స్ అని తెలుస్తోంది. మరోపక్క ప్రభుత్వం కూడా కరోనా కేసులు కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.దీంతో బాలకృష్ణ తన వంతుగా ఈ విధంగా తన నియోజకవర్గ ప్రజలకు కిట్స్ పంపారని అంటున్నారు.

    English summary
    Hindupur MLA Nandamuri Balakrishna sent 2000 COVID-19 Medicl Kits to Hindupur people. While the Medicl Kits cost ₹20 lakh, he sent them in a special vehicle, to hindupur.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X