Amigos: కల్యాణ్ రామ్ అమిగోస్‌లో బాలయ్య.. ఫ్యాన్స్‌కు నందమూరి హీరో సర్‌ప్రైజ్

బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. నటన మీద ఉన్న ప్యాషన్‌తో నిరంతరాయంగా కష్టపడుతూ మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు నందమూరి కల్యాణ్ రామ్. కెరీర్ ఆరంభంలో కమర్షియల్ సినిమాలే చేసిన అతడు.. ఈ మధ్య కాలంలో పంథాను మార్చుకుని ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది 'బింబిసార'తో కెరీర్‌లోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే కల్యాణ్ రామ్ ఇప్పుడు 'అమిగోస్' అనే ప్రయోగాత్మక చిత్రాన్ని చేస్తున్నాడు. క్రేజీ కాన్సెప్టుతో రాబోతున్న ఈ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.

రాజేంద్ర రెడ్డి అనే దర్శకుడితో నందమూరి కల్యాణ్ రామ్ చేస్తోన్న చిత్రమే 'అమిగోస్'. ఇందులో అతడు త్రిపాత్రాభినయం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ఇటీవలే అనౌన్స్ చేసేసింది. దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన దక్కింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేశారు. ఇది కూడా భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఇక, ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కల్యాణ్ రామ్ నుంచి అదిరిపోయే ప్రకటన ఒకటి వచ్చింది.

Balakrishna Song Remix in Nandamuri Kalyan Ram Amigos Movie

క్రేజీ కాన్సెప్టుతో రూపొందుతోన్న 'అమిగోస్' మూవీ ఫిబ్రవరి 10వ తేదీన విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రంపై ఉన్న కొన్ని సందేహాలతో పాటు ఓ సర్‌ప్రైజ్‌ను కల్యాణ్ రామ్ తాజాగా రివీల్ చేశాడు. ఈ మేరకు ఓ ప్రమోషనల్ వీడియోలో భాగంగా అతడు ఫ్యాన్స్‌తో ఫోన్‌లో మాట్లాడాడు. ఇందులో అసలు అమిగోస్ అంటే ఏంటి? కల్యాణ్ రామ్ బ్రదర్స్‌గా కనిపిస్తున్నాడా? ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందా? లేదా? అని ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చాడు. అలాగే, ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ పాత సాంగ్‌ను రిమిక్స్ చేసినట్లు కూడా కల్యాణ్ రామ్ ప్రకటించాడు.

'అమిగోస్' మూవీలో కల్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తున్నాడు. ఇందులో అతడికి జోడీగా అషికా రంగనాథ్ నటిస్తోంది. ఇక, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ మూవీకి గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X