For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సౌందర్యతో బాలయ్య ఆఖరి సినిమా.. మొత్తానికి మీ కోరిక నెరవేరబోతోంది

    |

    సినిమా పరిశ్రమలో అనుకోకుండా ఆగిపోయిన సినిమాలో ఎన్నో ఉన్నాయి. అయితే కొన్ని షూటింగ్ సగంలోనే ఆగిపోగా మరికొన్ని షూటింగ్ పూర్తయ్యి థియేటర్స్ లో రిలీజ్ అయ్యే చివరి నిమిషంలో అటకెక్కాయి. అయితే వాటన్నిటికి ఇప్పుడు డిజిటల్ రిలీజ్ ద్వారా మోక్షం లభిస్తోంది. ఇక బాలకృష్ణ కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అనుకున్న సినిమా కూడా అప్పట్లో కొన్ని రోజులకే ఆగిపోయింది. అదే నర్తనశాల.

     బాలకృష్ణ దర్శకత్వంలోనే..

    బాలకృష్ణ దర్శకత్వంలోనే..

    బాలకృష్ణ 16ఏళ్ల క్రితం నర్తనశాల అనే సినిమాను తన దర్శకత్వంలో తెరకెక్కించాలని అనుకున్నాడు. సినిమాను చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. 1963లో సీనియర్ ఎన్టీఆర్ నటించిన నర్తనశాల ఆధారంగానే ఆ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే సడన్ గా సినిమాకు అనుకోని సమస్యలు వచ్చి పడడంతో ఆపేశారు.

    సౌందర్య చనిపోవడంతో..

    సౌందర్య చనిపోవడంతో..

    ముందే ఈ ప్రాజెక్ట్ కు కొన్ని ఆర్థిక కారణాలు కూడా ఇబ్బందులు పెడుతున్న సమయంలో హీరోయిన్ సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. ద్రౌపతి పాత్ర చేయడానికి ఒప్పుకున్న సౌందర్య చనిపోవడంతో 2004లో ఆ సినిమా అలానే ఆగిపోయింది. అయితే ఆ సినిమాను మళ్ళీ తెరకెక్కించడానికి బాలయ్య ఎందుకో ధైర్యం చేయలేదు.

     ఆ 17 నిమిషాల సన్నివేశాలను..

    ఆ 17 నిమిషాల సన్నివేశాలను..

    అప్పట్లో శ్రీ రామరాజ్యం అనంతరం బాలయ్య మళ్ళీ ఆ సినిమా చేసేందుకు సిద్దామవుతున్నట్లు టాక్ వచ్చింది గాని మళ్ళీ ఎందుకో తెరపైకి రాలేదు. ఇక చాలా కాలం తరువాత ఆ సినిమాకు డిజిటల్ లో కొంతవరకు మోక్షం లభిస్తోంది. అప్పట్లో సినిమా షూటింగ్ ని కొంత పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇక 17 నిమిషాల నిడివితో ఉన్న సన్నివేశాలను శ్రేయస్ etలోని ఎన్‌టిఆర్ థియేటర్‌లో దసరా కానుకగా ప్రదర్శించబడుతుందని తెలిపారు.

     బాలకృష్ణ ఏమన్నారంటే..

    బాలకృష్ణ ఏమన్నారంటే..

    బాలకృష్ణ సోషల్ మిసియా ద్వారా ఈ విధంగా వివరణ ఇచ్చారు. నాకు అత్యంత ఇష్టమైన చిత్రం నాన్నగారి నర్తనశాల. ఆ చిత్రాన్ని నా దర్శకత్వంలో ప్రారంభించిన విషయం తెలిసిందే.ఎంతో కాలంగా మీరు ఆ చిత్రం కోసం చిత్రీకరించిన సన్నివేశాలను చూడాలన్న ఆసక్తిని చూపిస్తున్నారు. మీ అందరి కోరికపై ఈ నర్తనశాల చిత్రానికి సంబంధించి 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ఈ విజయదశమి కానుకగా ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేయడం జరుగుతుంది.

    మీ కోరిక నెరవేరబోతోంది

    మీ కోరిక నెరవేరబోతోంది

    అర్జునుడిగా నేను, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు గారు కనిపిస్తాము. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్ కి ఉపయోగించడానికి నిర్ణయించుకున్నాను. ఎన్నాళ్ళనుండో నర్తనశాల సన్నివేశాలను చూడాలన్న మీ కోరిక ఈ నెల 24న నెరవేరబోతోంది.. అంటూ బాలకృష్ణ వివరణ ఇచ్చారు.

    English summary
    Balakrishna wanted to direct a film called Narthanashala 16 years ago under his direction. The movie started out very grand. The film was based on the dance floor in 1963, starring senior NTR. However, the film was abruptly stopped due to unforeseen problems.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X