For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలకృష్ణ కాండ్రించి ముఖాన ఉమ్మాడు.. కోట సంచలనం, పాంట్ జిప్ తీసి అసభ్యకరంగా!

  |

  టాలీవుడ్ లో కొన్ని వందల సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటుడు కోట శ్రీనివాసరావు తాజా యూట్యూబ్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడు బాలకృష్ణ తన ముఖం మీద ఖాండ్రించి ఉమ్మేసి అంటూ ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. అయితే అసలు ఏం జరిగింది ? బాలకృష్ణ కోట శ్రీనివాసరావు ముఖం మీద ఎందుకు అలా చేశారు ? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ వివరాల్లోకి వెళితే

  బ్యాంకు ఉద్యోగిగా

  బ్యాంకు ఉద్యోగిగా

  మొదట బ్యాంకు ఉద్యోగిగా స్థిరపడిన కోట శ్రీనివాసరావు నటన మీద మమకారంతో నాటకాలు వేస్తూ ఉండేవారు. అలా ఆయన వేసిన ప్రాణం ఖరీదు అనే ఒక నాటకం సినిమాగా రూపుదిద్దుకున్న క్రమంలో ఆయన అదే సినిమాలో చిన్న పాత్ర లభించింది. ఆ తర్వాత కూడా ఆయనకు వరుస అవకాశాలు వచ్చి పడలేదు. ఆయన ఒక పక్క బ్యాంకు ఉద్యోగం చేసుకుంటూ మరో పక్క సినిమాల్లో అవకాశాల కోసం తిరుగుతూ ఉండేవాడు.. అయితే అనూహ్యంగా సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక మండలాధీశుడు అనే సినిమా చేశారు. అందులో ఎన్టీఆర్ను అనుకరించే పాత్రలో కోట శ్రీనివాస రావు నటించమని కోరారు.

  డేర్ చేసి

  డేర్ చేసి

  అయితే అప్పటికే తనకు సరైన గుర్తింపు లేకపోవడం, సినిమాల్లో అవకాశాలు దొరుకుతాయో లేదో అనే మీమాంసలో పడడంతో కోట శ్రీనివాసరావు బాగా ఆలోచించుకుని ఈ సినిమా చేసి ఈ సినిమా రిజల్ట్ కనుక తేడా వస్తే అప్పుడు వెనక్కి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యారట. అలా మండలాధీశుడు అనే సినిమాలో ఆయన ఎన్టీఆర్ను అనుకరించే పాత్రలో నటించి మెప్పించారు. ఆ తర్వాత కృష్ణ నటించిన అన్ని సినిమాల్లో దాదాపు ఆయనకు అవకాశాలు ఇవ్వడం ప్రారంభించారు.. అలా మొత్తం మీద కోట శ్రీనివాసరావు ఈరోజు మహానటుడు స్థాయికి ఎదగడంలో కృష్ణ తోడ్పడ్డారు అనే చెప్పాలి. అయితే ఎన్టీఆర్ మీద ఆ సినిమా చేసినందుకుగాను తాను చాలా ఇబ్బందులు పడ్డానని ఆయన ఆ వివరాలు వెల్లడించారు.

  ఎన్టీఆర్ గుర్తుపట్టలేదు

  ఎన్టీఆర్ గుర్తుపట్టలేదు

  సినిమా చూసిన తర్వాత తనను ఎన్టీఆర్ అభిమానులు అలాగే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా ద్వేషించే వారని ఆయన అన్నారు.. అయితే ఒక రోజు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా డబ్బింగ్ చెప్పేందుకు చెన్నైకి వస్తున్నారు అనే విషయం తనకు తెలిసిందని అదే సమయానికి తాను కూడా చెన్నై ఎయిర్ పోర్ట్ లో ఉన్నానని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.. చెన్నై ఎయిర్ పోర్ట్ లో తన ముందు విజయ్ చందర్ లైన్ లో ఉండగా ఆయనకు తన బ్యాగ్ అప్పగించి నేరుగా ఎన్టీఆర్ వద్దకు వెళ్లి నమస్కారం చేశానని అన్నారు. అయితే తనను ముందు ఎన్టీఆర్ గుర్తుపట్టలేదు అని తర్వాత గుర్తుపట్టి మీరు చాలా బాగా నటిస్తున్నారు బ్రదర్ మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారని ఆయన చెప్పుకొచ్చారు.

  చాచి ఒకటి ఇస్తే

  చాచి ఒకటి ఇస్తే

  ఆ తర్వాత పరుచూరి గోపాలకృష్ణ అలా ముందుకు వెళ్ళి నుంచున్నావు ఆయనకు కోపం వచ్చి చాచి ఒకటి ఇస్తే ఏం చేసేవాడివి అని ప్రశ్నించారని అలా ఇచ్చినా మీ అందరితో మాటలు పడే బాధ తప్పుతుంది కదా అక్కడితో అకౌంట్ క్లోజ్ అయిపోతుంది కదా అని తన కోట శ్రీనివాసరావు వెల్లడించారు. అంతేకాక తను ఒక సినిమా షూటింగ్ నిమిత్తం ఖమ్మం వచ్చానని అయితే విజయవాడలో తన కుమార్తె ఇంటికి వెళ్లాలని ఖమ్మం నుంచి విజయవాడకు రైలులో బయలుదేరి వెళ్లానని ఆయన అన్నారు. విజయవాడ వచ్చేసరికి అప్పుడే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి హోదాలో విజయవాడ వచ్చి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్నాను అని ఆ కోలాహలం అంతా స్టేషన్ లో ఉందని చెప్పుకొచ్చారు.

  జిప్ తీసి అసభ్యకరంగా

  జిప్ తీసి అసభ్యకరంగా

  ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో విజయవాడ స్టేషన్ అంతా నిండి పోయిందని అయితే వీళ్ల కంట్లో పడితే నన్ను ఏదో ఒకటి చేస్తారని ముందే ఊహించి ఎవరి కంటా కనపడకుండా వెళ్లడానికి ప్రయత్నించానని కానీ ఎవరో ఒకరు చూసి అరే కోట గాడు వచ్చాడు అని అనడంతో ఒక్కసారిగా పెద్ద గుంపు తన వైపు దూసుకు వచ్చిందని అన్నారు. అందులో కొందరు కొట్టగా కింద పడిపోయాను అని ఒక వ్యక్తి తన గుండెల మీద కూర్చుని జిప్ తీసి అసభ్యకరంగా ప్రవర్తించాడని ఈ విషయాలు జీవితాంతం మరచిపోలేని అలాంటి కష్టాలు తాను అనుభవించానని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు..

  Vijay Sethupathi తెలుగు బ్రాండ్ వాల్యూ పీక్స్.. | NBK పక్కన విలన్ గా నిజమే!! || Filmibeat Telugu
  ముఖం మీద కాండ్రించి

  ముఖం మీద కాండ్రించి

  అయితే ఇది జరిగిన కొన్ని రోజులకు తాను రాజమండ్రి షూటింగ్ వెళ్లగా అక్కడ వేరే షూటింగ్ నిమిత్తం బాలకృష్ణ కూడా వచ్చారని ఆయన వెల్లడించారు.. ఇద్దరూ ఒకే చోట బస చేయగా ఆయన లిఫ్ట్ లో పై నుంచి కిందకు వస్తుందని తాను కింద నుంచి పైకి వెళ్ళేందుకు లిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండగా అక్కడ వాళ్ళందరూ తప్పుకోండి తప్పుకోండి అంటున్నారని తనకు ముందు అర్థం కాలేదని ఆయన అన్నారు.. అయితే బాలకృష్ణ అందులోంచి దిగుతుండగా చూసి నమస్కారం పెట్టాను అని నమస్కారం పెడితే ఆయన కాండ్రించి ముఖం మీద ఉమ్ము వేశాడని ఆయన అన్నారు. ఒక ముఖ్యమంత్రి కొడుకు ఒక సూపర్ స్టార్ కొడుకు తన తండ్రిని తిడితే ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తించాడు అని ఆయన అన్నారు. ఇప్పుడంటే తాను ఒక గొప్ప నటుడిని అని బాలకృష్ణ కూడా అంటున్నారని కానీ ఒకప్పుడు మాత్రం ఇలా ఆయన చేతిలో అవమానం పొందానని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.

  English summary
  Senior actor Kota Srinivasa Rao revealed that Balakrishna Spitted On his Face.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X