Bhagavanth Kesari: బుక్‌మైషోలో భగవంత్ కేసరి సంచలనం.. అన్ని లక్షల టికెట్లతో బాలయ్య రికార్డు
చాలా ఏళ్ల క్రితమే సినిమాల్లోకి వచ్చి.. అప్పటి నుంచి తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోగా సత్తా చాటుతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. చాలా కాలం పాటు పరాజయాలను చవి చూసిన ఆయన.. 'అఖండ' మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కారు. అక్కడి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగుతున్నారు. దీనికితోడు ఈ ఏడాది ఆరంభంలో 'వీర సింహా రెడ్డి' చిత్రంతో మరో విజయాన్ని అందుకుని.. ఇప్పుడు 'భగవంత్ కేసరి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
నటసింహా నందమూరి బాలకృష్ణ - సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిన చిత్రమే 'భగవంత్ కేసరి'. ఈ చిత్రానికి యూఎస్‌లోని ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే సీన్ కనిపించింది. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలోనే లభించింది. ఫలితంగా ఈ చిత్రం ఆరు రోజుల్లోనే రూ. 50 కోట్లు షేర్‌తో పాటు రూ. 100 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టి సత్తా చాటింది. ఈ క్రమంలోనే తాజాగా బాలయ్య మూవీ మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకుంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' మూవీకి కేవలం ఆరు రోజుల్లోనే బుక్‌మైషో వెబ్‌సైట్‌లో 1 మిలియన్ (10 లక్షలు) టికెట్లు అమ్ముడుపోయాయి. అంటే అక్షరాలా 10 లక్షల మంది బుక్‌మైషో ద్వారా టికెట్లను కొనుగోలు చేసిన ఈ సినిమాను వీక్షించారు. తద్వారా 2023లో వేగంగా ఈ మార్కును చేరుకున్న తెలుగు చిత్రంగా ఇది రికార్డు సాధించింది. అంతేకాదు, సీనియర్ హీరోల్లో స్పీడుగా 1 మిలియన్ మార్కును చేరుకున్న హీరోగా బాలయ్య రికార్డు నమోదు చేసుకున్నారు.

ఇదిలా ఉండగా.. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ కాన్సెప్టుతో రూపొందిన 'భగవంత్ కేసరి' సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. శ్రీలీల కీలక పాత్రను చేసింది. అర్జున్ రాంపాల్ విలన్ రోల్‌ను పోషించాడు. దీనికి థమన్ సంగీతాన్ని అందించాడు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.


Click it and Unblock the Notifications











