NBK107 Trailer trending ఏపీ సీఎంను బాలకృష్ణ టార్గెట్ చేశాడా? సినీ, రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ

నటసింహ నందమూరి బాలకృష్ణ నూతన చిత్రం ఎన్​బీకే 107 ఫస్ట్ హంట్ టీజర్​ విడుదలైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్​ యాక్షన్​ ఎంటర్​టైనర్​గా తెరకెక్కనున్న సినిమా నుంచి ఫస్ట్​ హంట్​ పేరుతో విడుదలైన టీజర్​లో మాస్​ డైలాగ్స్, స్క్రీన్​ ప్రెజెన్స్​తో ఈలలు వేస్తున్నారు బాలయ్య అభిమానులు. అయితే ఈ విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని, అధికార పార్టీని డైరెక్ట్ గా టార్గెట్ చేసినట్టు ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

 మాస్ ట్రీట్

మాస్ ట్రీట్


నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా NBK107 ట్రైలర్ విడుదలైంది. ఆయన ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న క్రమంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు సందర్భాల్లో పలు అప్డేట్స్ వచ్చాయి. ఇప్పుడు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ బయటకు వచ్చింది. ఫస్ట్​ హంట్​ పేరుతో విడుదలైన టీజర్​తో బాలయ్య ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ఇచ్చారు దర్శకుడు గోపీచంద్ మలినేని.

 రాజకీయ దాడి

రాజకీయ దాడి


మాస్ డైలాగ్స్, మాస్ స్క్రీన్ ప్రెజన్స్ తో టీజర్ లో బాలయ్య హడావిడి ఓ రేంజ్ లో ఉంది. 'నీ జీవో గవర్నమెంట్ ఆర్డర్ - నా జీవో గాడ్స్ ఆర్డర్', 'భయం నా బయోడేటాలోనే లేదురా' అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. అయితే ఈ టీజర్ తోనే ఈ సినిమా కేవలం మాస్ ఎంటర్‌టైనర్ అని కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై రాజకీయ దాడి అని స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు.

భయం నా బయోడేటాలో

భయం నా బయోడేటాలో


బాలకృష్ణ పవర్ ప్యాక్ డైలాగులు నేరుగా అధికార వైఎస్సార్‌సీని టార్గెట్ చేసే విధంగా ఉన్నాయని అంటున్నారు. ఇక ఈ సినిమాలో టీజర్‌లో, బాలకృష్ణ ఒక మైలురాయిపై కూర్చున్నట్లు చూపబడింది ఆ మైలురాయి మీద "పులిజర్ల" అని రాసి ఉంది. ఇక పేరు జగన్ మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాన్ని పోలి ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఆయన నోటి వెంట మరో డైలాగ్: "భయం నా బయోడేటా లోనే లేదు రా బోసిడికే, " అనే డైలాగ్ కూడా అనేక సంచలనాలకు కారణమవుతోంది.

పెను దుమారాన్ని సృష్టించి

పెను దుమారాన్ని సృష్టించి


ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి మీడియా సమావేశంలో చేసిన బోసిడికే అనే కామెంట్ కొన్ని నెలల క్రితం ఆంధ్రా రాజకీయాల్లో పెను దుమారాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిపై అనుచిత పదజాలం వాడినందుకు పట్టాభిని అరెస్ట్ చేసి జైలులో కూడా పెట్టారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా సినిమాలో పెట్టడం చర్చనీయాంశం అవుతోంది.

చర్చనీయాంశం

చర్చనీయాంశం


ఇక అదేవిధంగా, బాలకృష్ణ నోట వెంట వచ్చిన మరో డైలాగ్: "మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్, నా జీవో గాడ్ ఆర్డర్, " కూడా హీరో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడని హింట్ ఇస్తోంది. ఎందుకంటే ఏపీలో ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక జీవోలను కోర్టులు కొట్టివేశాయి. అలాగే మరో డైలాగ్ "నరకడం మొదలు పెడితే, ఏ పార్ట్ ఎవరిదో మీ పెళ్లాలకు కూడా తెలియదు రా నా కొడకా.." అనడం కూడా చర్చనీయాంశం అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X