Balakrishna ఫ్యాన్స్ కు బాలయ్య మాస్ ట్రీట్.. ఒక్క టికెట్ పై ముగ్గురిని తలపించేలా డిఫరెంట్ గా!
ఇటీవల అఖండ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన నందమూరి నటసింహం బాలయ్య బాబు మరోసారి బాక్సాఫీస్ పై దండయాత్రకు సిద్ధమయ్యాడు. రవితేజ క్రాక్ చిత్రంతో మాస్ హిట్ కొట్టిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కిన చిత్రమే వీర సింహా రెడ్డి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి ఇప్పటికే అనేక ఇంట్రెస్టింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికరమైన సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతోంది. అదేంటనే విషయంలోకి వెళితే..

ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులు..
మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనే దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వీర సింహా రెడ్డి. ఇటీవల ఇటు బాలకృష్ణ అఖండ సినిమాతో, అటు గోపిచంద్ మలినేని క్రాక్ మూవీతో మంచి జోష్ మీదున్నారు. ఇక వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందనే టాపిక్ రాగానే నందమూరి అభిమానులు, మాస్ ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన షూటింగ్ స్పాట్ పిక్స్, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.

దాదాపుగా పూర్తయిన టాకీ..
వీర సింహారెడ్డి టైటిల్ పోస్టర్, నందమూరి నటసింహం బాలకృష్ణ గెటప్, టీజర్ అభిమానులను, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'వీరసింహారెడ్డి' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఈ ఏడాది మొదట్లోనే ఆరంభమైంది. అప్పటి నుంచి ఇది శరవేగంగా సాగుతోంది. ఇలా ఇప్పటికే దాదాపు టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసుకుంది

పల్నాడు బ్యాక్ డ్రాప్ లో
..
ఇప్పుడు వీర సింహారెడ్డి సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇటీవల ఈ సినిమా ఇంటర్వెల్ గురించి ఆసక్తికరమైన న్యూస్ లీక్ అయింది. పల్నాడు బ్యాక్ డ్రాప్‌లోని రియల్ స్టోరీతో రాబోతున్న 'వీరసింహారెడ్డి' మూవీని హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌తో రూపొందిస్తోన్నారు.

ఇంటర్వెల్ లో ట్విస్ట్..
ఇందులో బాలయ్య డ్యుయల్ రోల్ చేస్తున్నట్లు ఇప్పటికే ఓ న్యూస్ లీకైంది. అలాగే ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా హైలైట్‌గా ఉండబోతుందట. ఇందులో అసలు బాలకృష్ణ ఎవరు? శృతి హాసన్‌కు అతడికి ఉన్న రిలేషన్ ఏంటి? అనే విషయాలు రివీల్ చేస్తారని తెలిసింది. ఈ ట్విస్ట్ నరాలు కట్ అయ్యేంత షాకింగ్‌గా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు, దాని తర్వాత వచ్చే యాక్షన్ సీక్వెన్స్ పూనకాలు తెప్పించే విధంగా ఉంటుందని సమాచారం.

మూడు డిఫరెంట్ లుక్స్ తో..
ఇక ఇప్పుడు మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలయ్య బాబు మూడు డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బాలకృష్ణ డ్యూయెల్ రోల్ లో కనిపిస్తాడని తెలిసిన విషయమే. టైటిల్ ఫస్ట్ పోస్టర్ లో ఫ్యాక్షన్ లీడర్ గా బాలకృష్ణ కనిపించారు. అది తండ్రి క్యారెక్టర్. రెండో పాత్ర కుమారుడిది. ఇటీవల విడుదలైన సుగుణ సుందరి సాంగ్ లో ఆ లుక్ కూడా చూసేశాం.

అభిమానులు కోరుకునే విధంగా..
కథానుగుణంగా కుమారుడు విదేశాల్లో ఉంటాడట. అది సుగుణ సుందరి పాటలో కనిపించిన లుక్. విదేశాల నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత కుమారుడి క్యారెక్టర్ లుక్ లో మార్పులు ఉంటాయని వినికిడి. బాలకృష్ణ లుక్స్ పరంగా మరింత కేర్ తీసుకుని, అభిమానులు కోరుకునే విధంగా చూపించారట డైరెక్టర్ గోపిచంద్ మలినేని. అంటే ఒక్క సినిమా.. రెండు పాత్రలు.. మూడు డిఫరెంట్ గెటప్పులతో ఒక్క టికెట్ పై ముగ్గురిని తలపించనున్నాడు బాలయ్య బాబు.


Click it and Unblock the Notifications











