Skanda: రామ్ కోసం నందమూరి హీరో.. కనీవినీ ఎరుగని రీతిలో కొత్త ఈవెంట్
యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి హ్యాండ్సమ్ లుక్స్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని స్టార్‌గా దూసుకుపోతోన్నాడు ఉస్తాద్ రామ్ పోతినేని. ఆ మధ్య కాస్త ఇబ్బంది పడ్డా.. 'ఇస్మార్ట్ శంకర్' నుంచి తన రేంజ్‌ను క్రమంగా పెంచుకుంటోన్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేసుకుంటోన్నాడు.
భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్ పోతినేని ప్రస్తుతం 'స్కంద' అనే సినిమాలో నటిస్తున్నాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఇది పాన్ ఇండియా రేంజ్‌లో భారీ స్థాయిలో రూపొందుతోంది.

హై ఓల్టేజ్ యాక్షన్‌తో 'స్కంద' సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ గత ఏడాదిలోనే ప్రారంభం అయింది. అప్పటి నుంచి కొన్ని బ్రేకులు వచ్చినా దీన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇలా కొద్ది రోజుల క్రితమే టాకీ పార్టును కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా శరవేగంగా జరుపుతున్నారు.
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను రూపొందిస్తోన్న 'స్కంద' సినిమాను సెప్టెంబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. దీంతో ఇప్పుడు చిత్ర నిర్మాతలు పాటలు, వీడియోలపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్‌తో సాంగ్స్ రెండు రిలీజ్ చేశారు. ఇప్పుడు మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు.

'స్కంద' మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను ఆగస్టు 26వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవలే న్యూస్ లీకైంది. ఇందుకోసం అదే రోజున Pre Release Thunder పేరిట నిర్వహించబోతున్నట్లు తాజాగా ప్రకటన వెలువడింది. ఇక, ఈ ఈవెంట్‌కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో లీక్ అయింది.
ఇక, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న 'స్కంద' సినిమాను శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











