అన్నగారి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన బాలయ్య.. త్వరలో అలా తెలుగు ప్రజల ముందుకు!
తెలుగు వారి ఆరాధ్య దైవం, యావత్ దేశానికి రాజకీయ దిశా నిర్దేశం చేసిన ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచారు. ఈరోజు ఎన్టీఆర్ 98వ జయంతి సంధర్భంగా పలువురు ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మొదలు టాలీవుడ్ లో అందరూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. అయితే తన తండ్రి జయంతి సందర్భంగా బాలకృష్ణ కీలక ప్రకటన చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

ఎన్టీఆర్ జయంతి కానుక
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఓ వీడియోను కానుకగా ఇస్తామని ముందుగానే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే తాజాగా ఆయన తండ్రిని స్మరించుకుంటూ శ్రీరామ దండకాన్ని ఆలపించారు. దానికి సంబంధించిన వీడియోను జయంతి రోజు ఉదయమే విడుదల చేశారు. ఈ వీడియోలో రామ దండకం చదివి వినిపించిన ఆయన ''మా నాన్న గారు.. మీ అందరి అన్నగారు జన్మించి 98 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ తారక రాముడికి అంకితం ఈ శ్రీరామ దండకం' అంటూ మొదలు పెట్టారు.

భారతరత్నకి మెగా డిమాండ్
ఇక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి భారతరత్న ప్రకటించాలని కూడా చిరంజీవి కోరారు.ప్రముఖ గాయకులు నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారికి మరణానంతరం భారత రత్న ఇచ్చినట్టు, మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావు గారికి భారత రత్న ఇస్తే అది తెలుగువారందరికీ గర్వకారణం. వారి నూరవ జన్మదినం దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఈ గౌరవం దక్కితే అది తెలుగు వారికి దక్కే గౌరవం. ఆ మహానుభావుడి 98 వ జన్మదిన సందర్భంగా వారిని స్మరించుకుంటూ.. అని మెగాస్టార్ ట్వీట్ చేశారు.

మరొక్కసారి తాకి పోండి తాతా
ఇక జూనియర్ ఎన్టీఆర్ తాతను స్మరించుకుంటూ ''మా గుండెలను మరొక్కసారి తాకి పోండి తాతా'' అని ఎమోషనల్ గా పేర్కొన్నారు. 'మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది పెద్దమనసుతో ఈ ధరిత్రిని , ఈ గుండెని మరొక్కసారి తాకి పో తాత... సదా మీ ప్రేమకు బానిసను..' అంటూ తారక్ ట్వీట్ చేశాడు. ఇక ప్రతి ఏడాది తారక్ ఎన్టీఅర్ ఘాట్ ను సందర్శించేవారు, కానీ కరోనా కారణంగా ఈ ఏడాది వెళ్ళలేదు.
Recommended Video

ఈ సారి అలా
ఇక ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన బాలకృష్ణ. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్‌కు భారతరత్నఇస్తే ఇచ్చిన వారికి ఆ గొప్పదనం దక్కుతుందన్నారు. ఎన్టీఆర్ చరిత్రను తాను పుస్తకంగా రాస్తానని, పాఠశాలల్లో సైతం పాఠ్యాంశంగా చేర్చాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను బాలకృష్ణ కోరారు. అలా మరో సారి ఆయన చరిత్రను తెలుగు వారి ముందుకు తీసుకొస్తానని అన్నారు. నాన్న ఇచ్చిన స్ఫూర్తే తనని నడిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన రెండు చిత్రాల్లో నటించగా..బాక్సాపీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నాయి.


Click it and Unblock the Notifications











