Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బిజినెస్ డోస్ పెంచిన బాలయ్య.. షూటింగ్ పూర్తి కాకముందే భారీ ఆఫర్!
పవర్ఫుల్ యాక్షన్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ మూడవసారి బాలకృష్ణతో వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఫుల్ మీల్స్ లా సరికొత్త సినిమాను రెడీ చేస్తుండడంతో బిజినెస్ కూడా గట్టిగానే పెరుగుతోంది. రిలీజైన మొదటి టీజర్ కి కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.
ఇక అప్పటి నుంచే ప్రాజెక్టు యొక్క బిజినెస్ డీల్స్ మొదలయ్యాయి. కానీ కరోనా కారణంగా నిర్మాతలు ఆ మధ్య చర్చలు ఆపెయ్యాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్స్ మొదలవ్వడంతో బాలయ్య కూడా కొత్త షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
అయితే శాటిలైట్ రైట్స్ విషయంలో కూడా డీల్ క్లోజ్ అయినట్లు టాక్ నడుస్తోంది. గతంలో ఒక ప్రముఖ ఛానెల్ 9కోట్ల రూపయల వరకు ఆఫర్ చేసిందట. కానీ నిర్మాతలు టెంప్ట్ అవ్వకుండా వెయిట్ చేయడంతో ఇప్పుడు జెమిని టీవీ అంతకంటే ఎక్కువ రేటుకు శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఇక సినిమాకు సంబంధించిన డిజిటల్ ఓటీటీ రైట్స్ పై కూడా చర్చలు మొదలైనట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ తో పాటు హాట్ స్టార్ కూడా బాలయ్య సినిమా కోసం పోటీ పడుతున్నట్లు టాక్. ఇంకా ఆ డీలింగ్ పై నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇక సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికి ప్లాన్స్ వర్కౌట్ కావడం లేదు. కుదిరితే సమ్మర్ లో రిలీజ్ చేయాలని బాలయ్య ఇటీవల నిర్మాతలతో చర్చలు జరిపినట్లు సమాచారం.