BB3 టైటిల్.. డైరెక్టర్ బోయపాటి ఏమన్నారంటే?
నందమూరి బాలకృష్ణ కెరీర్ గత గొంత కాలంగా వరుస అపజయలతో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే సక్సెస్ ఉన్నా లేకున్నా కూడా ఆయన సినిమాల బిజినెస్ పై మాత్రం పెద్దగా ఎఫెక్ట్ పడటం లేదు. ఇక దర్శకులు నిర్మాతలు కూడా ఆయనతో సినిమా చేయడానికి ఎగబడుతున్నారు. ఇది అందరికి తెలిసిన విషయమే. బాలయ్యకు ఉండాల్సిన మార్కెట్ నిరంతరం స్థిరంగానే కొనసాగుతోంది. ఇక బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న సినిమా బడ్జెట్ విషయంలో కాస్త హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ సినిమా రిజల్ట్ పై మాత్రం అనుమానాలు లేవని టాక్ వస్తోంది.
ఎన్టీఆర్ బయోపిక్ తో ఊహించని విధంగా డిజాస్టర్స్ అందుకున్న బాలకృష్ణ ఎలాగైనా BB3 ద్వారా బాక్సాఫీస్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. వీలైనంత వరకు ఆ సినిమాను త్వరగా పూర్తి చేసి వెంటనే మరో సినిమాను కూడా పట్టాలెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ఇంకా బోయపాటి టైటిల్ పై క్లారిటీ ఇవ్వకపోవడంతో అభిమానులు కాస్త అప్సెట్ అవుతున్నారు.

టైటిల్ పై ఇప్పటికే అనేక రాకల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వడం సంతోసించాల్సిన విషయం. అయితే 'మోనార్క్' టైటిల్ నే ఫైనల్ గా ఫిక్స్ చేసినట్లు రూమర్స్ వైరల్ అవుతుండగా ఫైనల్ గా బోయపాటి స్పందించారు. నిజానికి టైటిల్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీలుకోలేదని ముందు షూటింగ్ పూర్తయిన తరువాతే మిగతా విషయాల గురించి ఆలోచించనున్నట్లు సమాచారం. కుదిరితే వచ్చే నెలలోనే ఒక అప్డేట్ రావచ్చని టాక్.


Click it and Unblock the Notifications











