twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రంజాన్ గెటప్‌తో అదరగొట్టిన బాలకృష్ణ.. ఎమోషనల్‌గా శుభాకాంక్షలు

    |

    టాలీవుడ్ నటుడు, టీడీపీ నేత, అనంతపురం జిల్లా హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, త్యాగాలకు ప్రతీకలు ముస్లింలు సోదరులు. భక్తిభావన, క్రమ శిక్షణ, అధ్యాత్మికత ఆదర్శ ప్రాయం. అలాంటి ముస్లిం సోదరులకు నా రంజాన్ శుభాకాంక్షలు అంటూ ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశారు.

    కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో మనోధైర్యాన్ని తెచ్చుకొంటూ కఠోర ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదరులందరికి నా రంజాన్ శుభాకాంక్షలు. మీ ప్రార్థనలు ఫలించాలని, కరోనా మహమ్మారి అంతం కావాలి. సకల మానవాళి అంతా బాగుండాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను.

     Balakrishna video message to Muslims on Ramzan

    ఈద్ సమయంలో ఇంట్లోనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాలి, మన అందరి జీవితాల్లో సుఖ: సంతోషాలు పంచాలని మనస్పూర్తిగా కోరుకొందాం. మరోసారి మీ అందరికి నా రంజాన్ పండగ శుభాకాంక్షలు, అల్లాఫీస్.. ఖుదాఫీస్ అంటూ బాలకృష్ణ ఈద్ శుభాకాంక్షల వీడియో సందేశాన్ని ముగించారు.

    ఇదిలా ఉండగా, బాలకృష్ణ సినిమా విషయానికి వస్తే.. బోయపాటి శ్రీనుతో ఓ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రంలో ఆయన అఘోరా పాత్రలో కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడింది.

    English summary
    Tollywood ator Balakrishna gives Ramzan Wishes to Musilms. He released a video message on social media. On emotional note, Balakrishna praised their spirtuality and wishes happy and safe Ramzan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X