Veera Simha Reddy ఈవెంట్ లో ఆకర్షించిన బాలయ్య చేతి వాచ్.. దాని ధర, చరిత్ర ఏంటంటే!

నందమూరి నటసింహం బాలకృష్ణ అంటే ఫ్యాన్స్ కు అమితమైన ప్రేమ, అభిమానం. బాలయ్య బాబు సినిమా వస్తుందంటే చాలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు ఆయన అభిమానులు. ఇప్పుడు వీర సింహా రెడడిగా బాలయ్య కృష్ణ గర్జించనున్నాడు. మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తొలిసారిగా బాలయ్య బాబు నటించిన ఈ చిత్రంలో బ్యూటిఫుల్ శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే జనవరి 6న నిర్వహించిన వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ ఎంతో హుందాగా తళుక్కుమన్నారు. ముఖ్యంగా ఆయన పెట్టుకున్న వాచ్ పై అందరి దృష్టి పడింది. ఈ నేపథ్యంలో ఆ వాచ్ ధర, దాని కథ ఏంటో తెలుసుకుందామా!

అభిమానుల్లో క్యూరియాసిటీ..

అభిమానుల్లో క్యూరియాసిటీ..

నట సార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తనదైన స్టైల్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. నందమూరి నటసింహం బాలకృష్ణను బాలయ్య బాబు అని ముద్గుగా పిలిచుకుంటారన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా బాలకృష్ణ నుంచి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఓ సినిమా వస్తుందంటే చాలు సినిమాపై అంచనాలే కాకుండా అభిమానుల్లో బీభత్సమైన క్యూరియాసిటీ నెలకొంటుంది.

 ఇద్దరు ఫుల్ జోష్ తో..

ఇద్దరు ఫుల్ జోష్ తో..


మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వీర సింహా రెడ్డి. ఇటీవల ఇటు బాలకృష్ణ అఖండ సినిమాతో, అటు గోపిచంద్ మలినేని క్రాక్ మూవీతో మంచి జోష్ మీదున్నారు. ఇక వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందనే టాపిక్ రాగానే నందమూరి అభిమానులు, మాస్ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఆ సమయం ఆసన్నమైంది.

సంక్రాంతి కానుకగా..

సంక్రాంతి కానుకగా..

వీర సింహారెడ్డి టైటిల్ పోస్టర్, నందమూరి నటసింహం బాలకృష్ణ గెటప్, టీజర్, సుగుణ సుందరి, జై బాలయ్య, మా బావ మనోభావాలు పాటలకు, ఇటీవల విడుదలైన ట్రైలర్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. బాలయ్య బాబు మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్న వీర సింహా రెడ్డి చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా.. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా జనవరి 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.

 గోల్డ్ కలర్ బ్లీజర్ లో..

గోల్డ్ కలర్ బ్లీజర్ లో..

ఒంగోలులో అట్టహాసంగా జరిగిన వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ తనదైన స్టైల్ తో మెస్మరైజ్ చేశాడు. గోల్డ్ కలర్ బ్లీజర్ వేసుకుని లోపల వైట్ షర్ట్ ధరించిన బాలకృష్ణ భారతీయ సంస్కృతికి అద్దం పట్టే దోతిలో హుందాగా దర్శనమిచ్చాడు నందమూరి నటసింహం బాలయ్య బాబు. అయితే ఈ కార్యక్రమంలో బాలకృష్ణ డ్రెస్సు మాత్రమే కాకుండా ఆయన చేతికి పెట్టుకున్న బ్లాక్ కలర్ స్ట్రిప్ ఉన్న వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది.

 అన్ని ట్యాక్సులు కలుపుకుని..

అన్ని ట్యాక్సులు కలుపుకుని..

వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ పెట్టుకున్న చేతి వాచ్ ఫేమస్ బ్రాండ్ అయిన కార్టియర్ (Cartier)కు చెందింది. ఈ చేతి వాచ్ ధర సుమారుగా రూ. 24 లక్షల 40 వేలు అని సమాచారం. అయితే ఈ ధర అంతా అన్నీ ట్యాక్సులను కలుపుకుని ఈ రేటు అని టాక్ వినిపిస్తోంది. అంటే బాలకృష్ణ పెట్టుకున్న ఈ వాచ్ ధర సుమారుగా పాతిక లక్షలు దాకా ఉందన్నమాట. అంతేకాకుండా ఈ వాచ్ కి ఒక చరిత్ర కూడా ఉందని టాక్.

1847లో పారిస్ లో ప్రారంభం..

1847లో పారిస్ లో ప్రారంభం..

మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీర సింహా రెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ చేతికి పెట్టుకున్న కార్టియర్ వాచ్ సంస్థను 1847లో పారిస్ లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఎప్పటికప్పుడు యునిక్ డిజైన్స్ తో ఈ సంస్థ వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తోంది. అయితే వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ పెట్టుకున్న వాచ్ మోడల్ "సాంటోస్ డి కార్టియర్ స్కెలెటన్ లార్జ్ మ్యానువల్ ఏడీఎల్సీ లెదర్".

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X