NBK109 300 కోట్లతో బాలకృష్ణ మల్టీస్టారర్ మూవీ.. ఇద్దరు స్టార్ హీరోలు.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్
తెలుగు సినిమా చరిత్రలో భారీ వ్యయంతో, నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం NBK109. ఈ సినిమాను గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే ప్రయత్నం జరుగుతున్నది. యంగ్ డైరెక్టర్ బాడీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన వివరాలు క్రేజీగా మారాయి. ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోలు కీలక పాత్రల్లో కనిపింబోతున్నారనే వార్త ట్రెండింగ్‌గా మారింది. ఈ మల్టీస్టారర్ సినిమాలో ఓ యంగ్ హీరోయిన్ ఆఫర్‌ను దక్కించుకొన్నది. ఈ క్రేజీ వివరాల్లోకి వెళితే..
బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న NBK109 సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్‌టైన్‌మెంట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్నది. ఈ సినిమా షూటింగ్ ఊటీలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో వివిధ భాషలకు సంబంధించిన నటులను ఎంపిక చేశారు. ఈ సినిమా వివరాలను త్వరలోనే సితారా ఎంటర్‌టైన్‌మెంట్ వెల్లడించేందుకు రెడీ అవుతున్నది.

ఇక నందమూరి కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న NBK109 చిత్రంలో బాలీవుడ్ నటుడు, యానిమల్ సినిమాతో దేశవ్యాప్తంగా ఆదరణ, అభిమానాన్ని సొంతం చేసుకొన్న బాబీ డియోల్, అలాగే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా, ఇటీవల కాలంలో తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌తో ఆకట్టుకొంటున్న ఊర్వశి రౌటేలా హీరోయిన్ నటిస్తున్నట్టు ఆమె పీఆర్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే వాల్తేరు వీరయ్య, BRO, స్కంధ లాంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్‌లో నటించి భారీ క్రేజ్‌ను, ఫాలోయింగ్‌ను సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే. తాజాగా బాలయ్య చిత్రంలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేయడం ఆసక్తిగా మారింది.

అయితే ఊర్వశి రటేలా నటించబోయే NBK109 మూవీలో ఆమె పాత్ర ఏమిటనేది గోప్యంగా ఉంచారు. దాంతో ఆమె అభిమానుల్లో ఎలాంటి పాత్రలో కనిపిస్తుందనే ఆసక్తి క్రమంగా పెరుగుతున్నది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆమె లుక్‌ను త్వరలోనే రిలీజ్ చేసేందుకు సితారా నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తున్నది.
ఇదిలా ఉండగా, నందమూరి బాలకృష్ణ, శ్రీలీల కలిసి నటించిన భగవంత్ కేసరి అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నది. దసరా కానుకగా రిలీజైన ఈ చిత్రం 50వ రోజులు పూర్తి చేసుకొన్నది. ఇటీవల కాలంలో వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య నటించిన ఈ సినిమా సుదీర్ఘకాలంగా ఆడిన రికార్డును సొంతం చేసుకొన్నది.


Click it and Unblock the Notifications











