twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బసవతారకం' ఆసుపత్రికి అరుదైన గౌరవం.. అంతా ఆయన వల్లే అంటూ ఆసక్తికర పోస్ట్!

    |

    తెలుగు రాష్ట్రాల్లో బసవతారకం హాస్పిటల్ అంటే తెలియనివారుండరు. స్వర్గీయ నందమూరి తారక రామారావు భార్య నందమూరి బాలకృష్ణ తల్లి అయిన బసవతారకం క్యాన్సర్ కారణంగా చనిపోయిన నేపథ్యంలో నందమూరి తారక రామారావు ఈ కేన్సర్ ఆసుపత్రి ఏర్పరచాలని భావించారు. అలా మొదలైన ఈ ఆస్పత్రికి ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది.. ఆ వివరాల్లోకి వెళితే

    అన్ని రాష్ట్రాల నుంచి

    అన్ని రాష్ట్రాల నుంచి

    బసవతారకం ఇండో అమెరికన్ మెమోరియల్ హాస్పిటల్ గురించి దాదాపు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు పక్కన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల నుంచి సైతం డబ్బులేక క్యాన్సర్ బారిన పడిన అనేక మంది పేదలు వచ్చి చేరుతూ ఉంటారు. డబ్బు ఉన్న వారి దగ్గర తీసుకుంటూ లేనివారి చాలా తక్కువ ధరకే వైద్యం అందిస్తూ ఈ ఆసుపత్రి పేరు తెచ్చుకుంది.

    పేదలకు క్యాన్సర్ వస్తే

    పేదలకు క్యాన్సర్ వస్తే

    నిజానికి ఎన్నో కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా సరే ఎన్టీఆర్ సతీమణి క్యాన్సర్తో చనిపోయారు. దీంతో తమలాంటి వారికి ఇలాంటి పరిస్థితి వస్తే పేదలకు క్యాన్సర్ వస్తే ఇక ప్రాణాలు వదిలేసుకోవడమే కదా అని భావించిన ఎన్టీఆర్ ఈ ఆసుపత్రిని ఏర్పరచాలని తరలించారు. అది కూడా ఎలాంటి లాభాపేక్ష లేకుండా. అలా అలా తండ్రి మొదలు పెట్టిన మహా యజ్ఞాన్ని బాలకృష్ణ పూర్తి చేశారు.

    21 ఏళ్ళు పూర్తి

    21 ఏళ్ళు పూర్తి

    2000 సంవత్సరంలో ఈ ఆసుపత్రిని ప్రారంభించి ఇప్పటికే 21 ఏళ్ళు పూర్తి కాగా క్యాన్సర్ తో వచ్చిన ఏ పేదవాడు వెనక్కి వెళ్లకుండా ఈ ఆసుపత్రిలో ఇప్పుడు సేవలు అందిస్తున్నారు. ఈ ఆస్పత్రి మొత్తానికి ఆధారం కేవలం విరాళాలు మాత్రమే. ఈ నేపథ్యంలో ఈ ఆస్పత్రి చేస్తున్న సేవలను గుర్తించిన నీతి ఆయోగ్ ఈ ఆస్పత్రిలో ఇచ్చే విరాళాలు మీద ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాల్సి ఉంటుందని ప్రతిపాదించింది.

    దేశంలోనే అత్యుత్తమ ప్రైవేటు ట్రస్ట్ ఆసుపత్రి

    దేశంలోనే అత్యుత్తమ ప్రైవేటు ట్రస్ట్ ఆసుపత్రి

    బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ తో పాటు పుట్టపర్తిలోని సత్యసాయి ఆసుపత్రి కూడా లాభాపేక్ష చూసుకోవని, పేద ప్రజలకు నిస్వార్థ సేవలు అందిస్తున్నాయని నీతి ఆయోగ్ తన తాజా నివేదికలో పేర్కొంది. దీని మీద ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ స్పందించారు. దేశ అత్యున్నత ప్రణాళిక వ్యవస్థ నీతి ఆయోగ్ తమ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని గుర్తించిందని చెప్పడానికి సంతోషిస్తున్నానని తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ ప్రైవేటు ట్రస్ట్ ఆసుపత్రిగా నీతి ఆయోగ్ తమ ఆసుపత్రిని పేర్కొందని వెల్లడించారు.

    అంతా ఆయన వల్లే

    అంతా ఆయన వల్లే

    ఇక ఈ ఘనత అంతా తన తండ్రి దివంగత నందమూరి తారక రామారావుకు చెందుతుందని బాలయ్య పోస్ట్ పెట్టారు. పేదలకు సముచిత ధరలో ప్రపంచస్థాయి క్యాన్సర్ చికిత్స అందాలన్న తన తండ్రి దార్శనికత వల్లే ఈరోజు ఈ గుర్తింపు లభించిందని ఆయన పేర్కొన్నారు. మా ట్రస్టు సభ్యులు, పెద్ద మనసు చూపుతున్న దాతలు, యాజమాన్యం, డాక్టర్లు, నర్సులు, సిబ్బంది తన తండ్రి ఆశయాన్ని నిజం చేస్తున్నారని బాలయ్య కొనియాడారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంటూ ఆయన ఫేస్ బుక్ వేదికగా పోస్ట్ పెట్టారు.

    English summary
    Basavatarakam cancer memorial hospital along with Satya Sai hospital in Anantapur has got the appreciation of the NITI Aayog. balakrishna responds on this Appreciation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X