స్టార్ క్రికెటర్‌తో బాలయ్య హీరోయిన్ డేటింగ్? రూమర్స్‌పై ఓపెన్ స్టేట్‌మెంట్
తెలుగు సినీ పరిశ్రమలో కొంతమంది హీరోయిన్‌ల పరిస్థితి ఒకింత అగమ్యగోచరంగా ఉంటుంది అని చెప్పొచ్చు. సినిమాలో ఎంట్రీ ఇవ్వడమే మంచి హిట్ అలాగే అందరి దృష్టిని బాగా ఆకర్షించినప్పటికీ సరైన ఆఫర్లు లేక సతమతం అవుతూ జీవితాన్ని సాగదీస్తున్న వారెందరో. కాగా హీరోయిన్స్ సంఖ్య ఎక్కువ ఉండడం వల్లో ఏమో కానీ ఆ కొంతమందికి పలు హిట్స్ ఉన్నప్పటికీ పెద్దగా ఆదరణ కూడా దక్కడం లేదు.
పోనీ గ్లామ్ షో చేయరా అంటే అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇలాంటి అన్ లక్కీ హీరోయిన్ నే ప్రగ్యా జైస్వాల్. తెలుగులో క్రిష్ జాగర్లమూడి - వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన కంచె సినిమాతో మంచి ఎంట్రీని ఆమె అందుకుంది. తర్వాత జయ జానకి నాయక, అలాగే ఇటీవల బాలయ్యతో "అఖండ" అనే భారీ హిట్ ని సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమాతో ప్రగ్యా కొంచెం బాగానే వినిపించింది కానీ తెలుగులో మాత్రం సరైన ఆఫర్స్ లేవు.

కాగా తెలుగు సహా హిందీలో కూడా పలు సినిమాలు నామ మాత్రంగానే చేస్తున్న ఈ హాట్ బ్యూటీ లేటెస్ట్ గా ఓ యువ క్రికెటర్ తో డేటింగ్ లో ఉందంటూ పలు వార్తలు బాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో హిందీ మీడియాతో జరిగిన ఓ ఇంటరాక్షన్ లో ప్రగ్య ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేసింది. యువ టాలెంటెడ్ క్రికెటర్ శుబ్ మన్ గిల్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
గిల్ తో కలిసి కనిపిస్తే మీ ఇద్దరూ బాగుంటారు అనే మాటకి గిల్ ని ఆమె ఆకాశానికి ఎత్తేసింది. అవును గిల్ బాగుంటాడు క్యూట్ గా అంటూ మాట్లాడ్డం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. అయితే వెంటనే జాగ్రత్త పడిన ప్రగ్య... గిల్ క్యూట్ గానే ఉంటాడు కానీ నేను ప్రస్తుతానికి మాత్రం సింగిల్ గానే ఉన్నానని చెప్పింది. తాను ఎవరితోనూ డేట్ లో లేను అంటూ రూమర్స్ రాకుండా అలర్ట్ అయ్యింది.

కాగా ఇదే ఇంటరాక్షన్‌లో ఒకవేళ ఓ క్రికెటర్ తో డేట్ చేయాల్సి వస్తే చేస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. తాను డేట్ చేసేందుకు సిద్ధమేనని .. అయితే అది క్రికెటర్ అనే కాదు మంచి వ్యక్తి అయితే అది ఎవరైనా పర్వాలేదు అంటూ ప్రగ్యా ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది. ఈ కామెంట్స్ తో ఈ ముద్దుగుమ్మ వార్తల్లోకి ఎక్కింది. కాగా ఇదే యంగ్ క్రికెటర్ శుబ్ మన్ గిల్ కి హీరోయిన్స్ తో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు రావడం ఇదే మొదటి సారి కాదు.
గతంలో బాలీవుడ్ యువ హీరోయిన్స్ సారా అలీ ఖాన్, అనన్య పాండే లాంటి హీరోయిన్స్ తో కూడా ఈ రకపు వార్తలు ఉన్నాయి. ఇక ప్రగ్యా జైస్వాల్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఈమె తెలుగులో మళ్ళీ బాలయ్యతోనే డాకు మహారాజ్ అనే సినిమాలో నటిస్తుండగా ఈ చిత్రాన్ని దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.


Click it and Unblock the Notifications











