తమిళనాడులో ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్‌పై నిషేధం? త్రివిక్రమ్‌పై తీవ్ర ఆగ్రహం

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న గాడ్ ఆఫ్ వార్ (God Of War) చిత్రానికి ఆదిలోనే ఎదురు దెబ్బ తగలింది. కుమారస్వామి అలియాస్ మురుగన్ దేవుడి కథా నేపథ్యంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు ఇటీవల చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను షేర్ చేసి మూవీని త్వరలోనే ప్రారంభించి సెట్‌పైకి వెళ్లనున్నట్టు అధికారికంగా ప్రకటించింది.

అయితే నిర్మాత నాగవంశీ, ఎన్టీఆర్ తమ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టర్‌ కారణంగా అత్యంత వివాదంగా మారింది. ఆ పోస్టర్‌లో పేర్కొన్న అంశాలు తమిళుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాను తమిళనాడులో నిషేధించాలని ఓ సంస్థ అధికారికంగా ప్రకటన చేయడంతో ఈ అంశం మరింత వివాదంగా మారింది. ఇంతకు ఈ సినిమాలో ఏ అంశాలు వివాదంగా మారాయనే వివరాల్లోకి వెళితే..

Ban on Jr NTR s God of War in Taminadu

గాడ్ ఆఫ్ వార్ సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ నిర్మాత నాగవంశీ షేర్ చేసిన పోస్టర్‌లో మురుగన్ జన్మ గురించి పేర్కొన్న అంశంపై తమిళుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. మురుగన్ గురించి చెబుతూ.. ఉత్తరాదిలో పుట్టాడు. హార్ట్‌లాండ్‌లో స్థానం సంపాదించుకొన్నాడు. దక్షిణాదిలో దేవుడిగా అందరి హృదయాల్లో కోలువ బడ్డారు. ఇది విశ్వానికి సంబందించిన కథ అంటూ ఓ క్యాప్షన్ పెట్టారు. అయితే మురుగన్ ఉత్దరాదిలో పుట్టారనే అనే అంశం తమిళుల మనోభావాలను దెబ్బ తీసింది. సోషల్ మీడియాలో ఈ విషయంపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దాంతో ఆ పోస్టర్‌ను డిలీట్ చేసి.. శివుడి కుమారుడు.. పార్వతి తనయుడు. నిత్య సేనాని కథతో మరోసారి త్రివిక్రమ్ వస్తున్నారు అని పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అయితే పోస్టర్, క్యాప్షన్ మార్చినప్పటికీ.. తమిళుల్లో ఆగ్రహం చల్లబడలేదు. తమిళనాడుకు చెందిన నామ్ తమిళర్ కచ్చి (NTK) తీవ్రంగా స్పందించింది. ఆ సంస్థ చీఫ్ సీమన్ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసి సినిమాపై బ్యాన్ విధించాలని డిమాండ్ చేశారు. గాడ్ ఆఫ్ వార్ సినిమాను తమిళనాడులో రిలీజ్ కాకుండా తమిళనాడు ప్రభుత్వం నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. తమిళ వారసత్వం, నాగరికతను కించపరిచేలా ఉందని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

తమిళులు ఇష్టంగా కొలిచే మురుగన్ దేవుడు ఉత్తరాదిలో పుట్టారని చెప్పడం అత్యంత దిగ్బ్రాంతికరమైన విషయం. హిందూదేవుళ్లపై సినిమాలు తీయాలని నిర్ణయించుకొన్నప్పడు చారిత్రాత్మక వాస్తవాలను వక్రీకరించవద్దు. మౌళిక విషయాలను నిర్లక్ష్యం చేసి తప్పుదోవ పట్టించేలా చేయొద్దు. త్రివిక్రమ్ టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం అని ఎన్‌టీకే చీఫ్ సీమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మురుగన్ దేవుడు తమిళుల ఆరాధ్యదైవం. తమిళులంటే మురుగన్.. మురుగన్ అంటే తమిళులు. ఈ రెండు విషయాలను వేరు చేయలేం. తమిళుల జీవితంతో ముడిపడి ఉన్న దేవుడు మురుగన్. మురుగన్ జననం గురించి రాజకీయాలు చేయవద్దు. మా సంస్కృతిని, జీవన విధానాన్ని కించపరచవద్దు. మురుగన్ గురించి చరిత్రను వక్రీకరించే హక్కు ఎవరికీ లేదు అని సీమన్ ఘాటుగా స్పందించారు.

Read more about: jr ntr trivikram srinivas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X