కరోనా పాజిటివ్.. ఆరోగ్యంపై వివరణ ఇచ్చిన బండ్ల గణేష్.. ఫ్యామిలీ సేఫ్!

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ ఇటీవల కరోనా కాటుకు గురైన విషయం తెలిసిందే. సాధారణ జనం నుంచి సెలబ్రెటీస్ వరకు చాలా మంది కరోనా వైరస్ భారిన పడుతున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత, కమెడియన్ గా ఉన్న బండ్ల గణేష్ కి కోవిడ్ 19 పాజిటివ్ అని తేలడంతో అందరు షాక్ అయ్యారు. ఒక్కసారిగా ఆయనతో తిరిగిన వాళ్ళు క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.

 ఎవరు నమ్మలేదు..

ఎవరు నమ్మలేదు..

బండ్ల గణేష్ కరోనా భారిన పడ్డాడు అనగానే మొదట్లో అవన్నీ అబద్ధాలే అని కొన్ని రూమర్స్ వచ్చాయి. రిపోర్ట్స్ వచ్చే వరకు కూడా బండ్ల గణేష్ కూడా నమ్మలేదు. అంతకుముందు వరకు వాస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ రిపోర్ట్స్ వచ్చిన తరువాత మీడియాలో ఆ న్యూస్ ఒక్కసారిగా వైరల్ అయ్యింది.

స్పందించక తప్పలేదు..

స్పందించక తప్పలేదు..

ఇక ఆరోగ్య పరిస్థితి వివిధ రకాల రూమర్స్ వస్తున్న సందర్భంలో స్వయంగా బండ్ల గణేష్ మరోసారి స్పందించక తప్పలేదు. అలాగే తన కుటుంబ పరిస్థితి గురించి కూడా ఈ సీనియర్ నిర్మాత వివరణ ఇచ్చాడు. ఇటీవల ట్విట్టర్ వేదికగా తన ఫాలోవర్స్ తో చాట్ చేసిన బండ్ల గణేష్ ఓ నెటీజన్ అడిగిన ప్రశ్నకు ఈ విదంగా వివరణ ఇచ్చాడు.

 ఫ్యామిలీ పరిస్థితి..

ఫ్యామిలీ పరిస్థితి..

ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా నిలకడగా ఉందని కోవిడ్-19 నుంచి కొలుకుంటున్నానని చెబుతూ.. అలాగే తన కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి గురించి కూడా వివరణ ఇచ్చాడు. కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి నెగిటివ్ అని తేలినట్లు బండ్ల గణేష్ వివరణ ఇచ్చాడు. అలాగే బయట వస్తున్న రూమర్స్ ని ఎవరు నమ్మవద్దని సన్నిహితుల ద్వారా తెలియజేశాడు.

Recommended Video

Bandla Ganesh కు Coronavirus పాజిటివ్..టెన్షన్ లో Tollywood!
హెయిర్ ప్లాంటేషన్ కోసమని..

హెయిర్ ప్లాంటేషన్ కోసమని..

బండ్ల గణేష్ కి కరోనా పాజిటివ్ అని తెలియగానే ఆయనతో తిరిగిన చాలా మంది హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు సమాచారం. హెయిర్ ప్లాంటేషన్ కోసమని వెళ్లిన గణేష్ గత వారం కరోనా భారిన పడి ఉంటారని తెలుస్తోంది. ఈ వార్తలతో ఇండస్ట్రీలో కూడా చాలా వరకు సెలబ్రెటీస్ ఇంకా షూటింగ్స్ లో పాల్గొనడానికి ధైర్యం చేయడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X