రెమ్యునరేషన్ విషయంలో ఎన్టీఆర్‌తో గొడవ.. చివరకు క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు బిజీ నిర్మాతగా కనిపించిన బండ్లగణేష్ టెంపర్ సినిమా తర్వాత.. మళ్ళీ ఎందుకో ఎలాంటి సినిమాలను నిర్మించలేదు. మొదట ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బండ్ల గణేష్ ఆ తర్వాత కొన్నాళ్లకు బిజినెస్ లతో ఆర్థికంగా కూడా ఎదుగుతూ వచ్చాడు. అనంతరం పరమేశ్వరా అనే ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేసి కొన్ని బాక్స్ ఆఫీస్ హిట్స్ ను కూడా అందుకున్నాడు. అయితే నిర్మాతగా అతనికి అవకాశాలు బాగానే వస్తున్నప్పటికీ సడన్ గా సైలెంట్ అయిపోయాడు. రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే ఒకానొక సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తో అతనికి విభేదాలు వచ్చినట్లు టాక్ అయితే వచ్చింది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ ఆ విషయంపై ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు.

పవన్ కళ్యాణ్ సలహా మేరకు

పవన్ కళ్యాణ్ సలహా మేరకు

2009లో రవితేజతో ఆంజనేయులు అనే సినిమాను నిర్మించిన బండ్ల గణేష్ ఆ సినిమాతో పర్వాలేదు అనే విధంగా లాభాలు అయితే అందుకున్నాడు. అనంతరం మళ్లీ రెండేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ అనే సినిమా చేశాడు. కానీ ఆ సినిమాకు దారుణమైన నష్టాలను మిగిల్చింది. ఆ తర్వాత సినిమాలు చేయవద్దని అనుకున్నా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ సలహామేరకు దబాంగ్ రీమేక్ హక్కులను తీసుకొని గబ్బర్ సింగ్ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు

స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు

గబ్బర్ సింగ్ అనంతరం బండ్ల గణేష్ ఒక్కసారిగా అగ్ర నిర్మాత గా ఎదిగిపోయాడు. ఆ తర్వాత నిర్మాతగా అతను ఏమాత్రం వెనక్కి తిరిగి చూసుకోలేదు. జూనియర్ ఎన్టీఆర్ తో బాద్షా, అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో.. అనే సినిమాలను నిర్మించాడు. కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో అయితే లాభాలను అందించలేదు.

జూనియర్ ఎన్టీఆర్ తో గొడవ

జూనియర్ ఎన్టీఆర్ తో గొడవ

ఇక 2014లో రామ్ చరణ్ తేజ్ - కృష్ణవంశీ కాంబినేషన్లో వచ్చిన గోవిందుడు అందరివాడేలే అనే సినిమా నిర్మించాడు. ఆ సినిమా కూడా పర్వాలేదు అనే విధంగా ఆకట్టుకుంది. ఇక బండ్ల గణేష్ చివరగా 2015 లో టెంపర్ అనే సినిమాను నిర్మించాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ ప్రొడక్షన్ వైపు తిరిగి చూడలేదు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో అతనికి కొన్ని గొడవలు అయినట్లు కూడా అప్పట్లో కథనాలు అయితే గట్టిగానే వచ్చాయి.

ఆ విధంగా జరిగింది..

ఆ విధంగా జరిగింది..

రెమ్యునరేషన్ విషయంలోనే జూనియర్ ఎన్టీఆర్ బండ్ల గణేష్ మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ బండ్ల గణేష్ ఆ విషయంపై స్పందిస్తూ జస్ట్ అది కేవలం ఒక మిస్ కమ్యూనికేషన్ మాత్రమే అని అన్నాడు. ఇక ఎంతో అన్యోన్యంగా ఉండే భార్య భర్తల మధ్యలో, అలాగే అన్నాచెల్లెళ్ల మధ్య లో కూడా విభేదాలు తలెత్తడంతో సహజమని అలాగే నాకు కూడా ఆ విధంగా కమ్యూనికేషన్ వల్ల ఒక చిన్న డిస్కషన్ జరిగిందనే వివరణ ఇచ్చాడు. అది తప్పితే తప్పితే మరొక గొడవ ఏమీలేదని బండ్ల గణేష్ సింపుల్ గా క్లారిటీ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X