పవన్ కళ్యాణ్‌పై బండ్ల గణేష్ ట్వీట్.. చరిత్రనే తుడిచేసేవాడు ఒక్కరంటూ..
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన మనసులో అనిపించిన మాటను మొహమాటం లేకుండా చెప్పే స్వభావం ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. అదే ధోరణి వల్ల కొంతమంది స్నేహితులను దూరం చేసుకున్నా, తన స్టైల్‌ను మాత్రం ఎప్పుడూ మార్చుకోలేదనే చెప్పాలి. ఒకప్పుడు వరుస సినిమాలతో నిర్మాతగా బిజీగా ఉన్న బండ్ల గణేష్, ఇటీవల కాలంలో కాస్త సైలెంట్‌గా ఉంటూ అప్పుడప్పుడూ మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు.
అయితే తాజాగా మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చారు. ఈసారి ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది. ఈ సారి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై చేసిన షాకింగ్ ట్వీట్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఎప్పటిలాగే బండ్ల గణేష్ భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. మరి బండ్ల గణేష్ ఏమన్నాడు? ఎందుకు ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది? అన్నదే ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతర్జాతీయంగా అత్యంత అరుదైన గౌరవం అందుకున్నారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ కెంజుట్సు (Kenjutsu) లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ, తనకంటూ ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని సంపాదించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. నటుడిగా మాత్రమే కాకుండా, ఆలోచన, క్రమశిక్షణ, ఆత్మనిబద్ధతతో కూడిన వ్యక్తిత్వంతో ఆయన ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్‌కు తాజాగా మార్షల్ ఆర్ట్స్ రంగంలో ప్రపంచ స్థాయి అరుదైన గౌరవం దక్కడం విశేషంగా మారింది.
ఈ గౌరవం ఒక్కరోజులో వచ్చినది కాదని అభిమానులు చెబుతున్నారు. మూడు దశాబ్దాలకు పైగా పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్‌పై చూపిన అంకితభావానికి, కఠినమైన సాధనకు ఇది గుర్తింపుగా భావిస్తున్నారు. సినిమాల్లోకి రాకముందే ఆయన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం ప్రారంభమైంది. చెన్నైలో ఉన్న రోజుల్లో కరాటే, యుద్ధకళల్లో శిక్షణ పొందిన పవన్, జపనీస్ సమురాయ్ సంప్రదాయాలు, తాత్విక విలువలను లోతుగా అధ్యయనం చేశారు.
జపాన్ సంప్రదాయ యుద్ధకళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థగా గుర్తింపు పొందిన సోగో బుడో కన్‌రి కై నుంచి పవన్ కళ్యాణ్‌కు ఫిఫ్త్ డాన్ (5th Dan) పురస్కారం లభించడం ఆయన కెరీర్‌లోనే కాదు, తెలుగు సమాజానికి కూడా గర్వకారణంగా మారింది. అంతేకాదు, చారిత్రాత్మకమైన టకెడా షింగెన్ క్లాన్ లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించారు.
అలాగే గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ఆయనను "టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్" అనే బిరుదుతో సత్కరించడం విశేషం.ఈ ఘనతకు సంబంధించిన వీడియోను పవన్ కళ్యాణ్ క్రియేట్ వర్స్ (Pawan Kalyan Creative Works) సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్ ను సినీ నిర్మాత బండ్ల గణేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 'చరిత్రలు రాసేవాళ్లు ఉంటారు... చరిత్రనే తుడిచేసేవాడు ఒక్కరే. మార్షల్ ఆర్ట్స్‌కు పులి - పవన్ కళ్యాణ్ సార్' అంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఘనతను తెలుగు నేల గర్వపడే క్షణంగా అభిమానులు అభివర్ణిస్తున్నారు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత బండ్ల గణేష్ కు ఉన్న అనుబంధం నిన్నటి విషయం కాదు. బండ్ల గణేష్ నిర్మాతగా ఎదగడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించిన సంగతి టాలీవుడ్‌కు తెలిసిందే. పవన్ హీరోగా తెరకెక్కిన తీన్ మార్, గబ్బర్ సింగ్ వంటి చిత్రాలతో బండ్ల గణేష్‌కు నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా 'గబ్బర్ సింగ్' సాధించిన ఘన విజయం తన జీవితాన్నే మలుపు తిప్పిందని బండ్ల గణేష్ ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పుకొచ్చారు.
అందుకే పవన్ కళ్యాణ్‌ను తన కెరీర్‌లోనే కాదు, జీవితంలోనూ టర్నింగ్ పాయింట్‌గా బండ్ల గణేష్ ఎప్పటికీ గుర్తు చేసుకుంటుంటారు. పవన్‌పై ఆయనకు ఉన్న అభిమానమూ, కృతజ్ఞతా భావమూ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలోనూ స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్‌తో ఆయనకు ఉన్న అనుబంధం మాత్రం టాలీవుడ్‌లో ఎప్పటికీ ప్రత్యేకంగానే నిలుస్తుందని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











