సైలెంట్ గా బండ్ల గణేష్ కూతురు ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరంటే?

Bandla Ganesh: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన మనసులోని మాటను ఏ మాత్రం భయపడకుండా బయటపెట్టే వ్యక్తుల్లో ఆయన ముందుంటాడు. ఒకప్పుడు నిర్మాతగా బిజీగా ఉన్న బండ్ల గణేష్ గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉంటూ, మీడియా ముందు అప్పుడప్పుడూ మాత్రమే కనిపించారు. తాజాగా బండ్ల గణేశ్ ఓ శుభవార్త చెప్పారు. ఇంతకీ ఆ శుభవార్త ఏంటీ?

బండ్ల గణేశ్ కెరీర్ మొదటగా చిన్న పాత్రలతో నటుడిగా సినీ రంగంలో అడుగుపెట్టి, తరువాత కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు సంపాదించారు. 'సుస్వాగతం', 'మల్లీశ్వరి', 'ఆంధ్రావాలా', 'పోకిరి' వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. అనంతరం నిర్మాతగా మారి 'పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్' బ్యానర్‌ను స్థాపించారు. 'గబ్బర్ సింగ్', 'టెంపర్', 'బాద్‌షా', 'ఇద్దరమ్మాయిలతో' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను నిర్మించి నిర్మాతగా కూడా తన సత్తా చాటుకున్నారు.

Bandla Ganesh Daughter Janani Wedding News Pasupu Kumkuma Ceremony Details

కొంతకాలం రాజకీయాల్లో కూడా యాక్టివ్‌గా ఉన్న ఆయన, తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి 'సరిలేరు నీకెవ్వరు' వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. సినిమాలకు కొంత విరామం తీసుకున్నప్పటికీ, తన స్పీచులు, సోషల్ మీడియా పోస్టులతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే బండ్ల గణేశ్, ఇప్పుడు తన కుటుంబ శుభవార్తతో మరోసారి హైలైట్ అయ్యారు.

ఆ శుభవార్త ఏంటో కాదు.. బండ్ల గణేష్ కూతురు జనని బండ్ల త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుండగా, ఈ శుభవార్తను స్వయంగా బండ్ల గణేశ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.'దేవుడి ఆశీస్సులు, మా పెద్దల దీవెనలతో మా ఇంట్లో త్వరలో శుభకార్యం జరగబోతోంది' అంటూ ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఇప్పటికే వివాహ వేడుకలకు సంబంధించిన తొలి కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి.

ఇటీవల కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సంప్రదాయబద్ధంగా పసుపు-కుంకుమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను బండ్ల గణేశ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఆ ఫోటోల్లో జనని బండ్లతో పాటు కాబోయే వరుడు సూర్యతేజ చిలుకూరి, అలాగే రెండు కుటుంబాల పెద్దలు కూడా కనిపిస్తున్నారు.

ఇంతకీ వరుడు ఎవరంటే?
జనని బండ్ల కాబోయే భర్త సూర్యతేజ చిలుకూరి గురించి కూడా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం, ఆయన కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపారంతో సంబంధం కలిగి ఉందని తెలుస్తోంది. అయితే ఆయన వ్యక్తిగత వివరాలు, ప్రొఫెషనల్ బ్యాక్‌గ్రౌండ్ వంటి అంశాలు ఇంకా పూర్తిగా బయటకు రావాల్సి ఉంది. ఇదే విషయంపై సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతున్నాయి.

ఇక బండ్ల గణేశ్ తన కూతురి నిశ్చితార్థాన్ని చాలా సింపుల్‌గా, కుటుంబ సభ్యుల మధ్యనే నిర్వహించడం విశేషంగా మారింది. భారీగా కాకుండా సంప్రదాయ విలువలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ వేడుకను జరిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు బండ్ల గణేశ్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X