సరిలేరు నీకెవ్వరు: బండ్ల గణేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సరి లేరు నీకెవ్వరు'. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరుగుతోంది. ఈ సినిమా ద్వారా నిర్మాత బండ్ల గణేష్ నటుడిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు.
ఈ చిత్రంలో బండ్ల గణేష్ బక్రా పాత్ర పోషిస్తున్నారట. ఇందులో అతడు కామెడీ పాత్రలో కనిపించబోతున్నారని, ట్రైన్ ఎపిసోడ్లో గణేష్ కనిపిస్తారని, మహేష్ బాబు, మరికొందరు కమెడియన్లతో కలిసి చిత్రీకరించిన సీన్లో అతడు నటించాడని, షూటింగ్ పార్ట్ దాదాపుగా పూర్తియినట్లు టాక్.

గబ్బర్ సింగ్ చిత్రంలో 'అంత్యాక్షరి' సీన్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదే తరహాలో 'సరిలేరు నీకెవ్వరు'లో ట్రైన్ ఎపిసోడ్ ఉంటుందని, ఇది సినిమాలో హైలెట్ అవుతూ నవ్వులు పూయిస్తుందని సమాచారం.
మొత్తం 4 రోజుల్లో బండ్ల గణేష్ షూటింగ్ పార్ట్ చిత్రీకరణ పూర్తయిందని, ఒక్కో రోజుకు రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 20 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీలో టాప్ కమెడియన్లు మాత్రమే రోజుకు ఇంత భారీ స్థాయిలో చార్జ్ చేస్తున్నారు, ఇపుడు ఆ లిస్టులో బండ్ల గణేష్ కూడా చేరడం చర్చనీయాంశం అయింది.
సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన హీరోయిన్. ఎకె ఎంటర్టెన్మెంట్స్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్ పతాకాలపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి 2020కి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా విజయశాంతి కూడా రీ ఎంట్రీ ఇస్తున్న సంగత తెలిసిందే.


Click it and Unblock the Notifications











