కొత్త అవతారం ఎత్తిన బండ్ల గణేష్ .. నాన్నకు తానే స్వయంగా.. కరోనా భయంతోనే!
ప్రొడక్షన్ డిపార్టమెంట్ లో పని చేయడం మొదలు పెట్టి ఈరోజు పెద్ద ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగాడు బండ్ల గణేశ్. కమెడియన్‌గా అవకాశాలు తగ్గిన సమయంలో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌లో తనకు అంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమాలతో ఎంత క్రేజ్ వచ్చిందో చెప్పలేం కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చి కొన్ని కామెంట్లు చేసి అంతకంటే ఎక్కువ గుర్తింపు తన మాటలు, చేష్టలతో తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత ఆయనకు సోషల్ మీడియాలో సైతం క్రేజ్ పెరిగింది. అయితే తాజాగా కరోనా బారిన పడి కోలుకున్న బండ్ల గణేష్ మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు.
Recommended Video
కరోనా కారణంగా బయటకు వెళ్ళలేని పరిస్థితిలో తన తండ్రికి తానే స్వయంగా కటింగ్ చేశాడు. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. 'కరోనా భయంతో మా నాన్నకి ఈరోజు మా షాద్ నగర్ ఇంట్లో నేనే కటింగ్ చేశాను' అని పేర్కొన్న్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతొంది. నిజానికి తమిళంలో కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన మండేలా అనే సినిమా అందరినీ ఆకట్టుకుంది.

నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ఈ సినిమాని తెలుగు నిర్మాత అనిల్ సుంకర కొన్నారని అంటున్నారు. అయితే బండ్ల గణేష్‌ను హీరోగా పెట్టి ఈ మూవీ తీయబోతోన్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మండేలా రీమేక్‌లోకి సునీల్ ఎంట్రీ ఇచ్చారు.. బండ్ల గణేష్ తప్పుకున్నారు అంటూ ఓ వార్త కూడా తిరుగుతోంది. ఆ విషయం మీద క్లారిటీ లేదు కానీ, ఆ సినిమాలో యోగిబాబు నాయీ బ్రాహ్మణ పాత్ర పోషించారు. ఇప్పుడు బండ్ల కూడా ఇన్ డైరెక్ట్ గా తన తండ్రికి అదే పని చేస్తూ వీడియో పెట్టడం చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications











