For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గెలవకపోతే ఏం కోసుకుంటావ్ అని అడుగుతున్నారు.. ఈసారి అలా కాకుండా.. బండ్ల గణేష్ మరో సవాల్

  |

  టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న బండ్లగణేష్ ప్రస్తుతం సినిమా రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాడు. అసలైతే రెగ్యులర్ రాజకీయాలకు దూరంగా ఉంటానని గతంలో చెప్పిన బండ్లగణేష్ మళ్లీ ఇప్పుడు అనుకోని విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రధానమైనటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో కీలకం గా మారుతున్నాడు. ఇక ఈ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి అనే విషయం గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఇక అందరి ఫోకస్ కూడా బండ్ల గణేష్ పైనే ఉంది. ఆయన జనరల్ సెక్రెటరీ స్థానానికి పోటీ చేస్తున్న సందర్భంగా ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఒక సవాల్ కూడా చేశారు.

  నిర్మాతగా భారీ విజయాలు

  నిర్మాతగా భారీ విజయాలు

  బండ్ల గణేష్ సినిమా ఇండస్ట్రీలోకి మొదట ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే మెల్లగా రియల్ ఎస్టేట్ పౌల్ట్రీ బిజినెస్ లోకి వెళ్లిన వాళ్లన గణేష్ తన తెలివితో బాగానే ఆదాయాన్ని అందుకున్నాడు ఇక ఆ తర్వాత మెల్లగా నిర్మతగా అడుగుపెట్టి గబ్బర్ సింగ్ సినిమాతో ఒక్కసారిగా బడా నిర్మాతగా మారిపోయాడు. ఆ సినిమా తర్వాత వరుసగా రామ్ చరణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ వంటి హీరోలతో సినిమాలు చేసిన విషయం తెలిసిందే.

  ఆ ఒక్క డైలాగ్ తో వైరల్

  ఆ ఒక్క డైలాగ్ తో వైరల్


  ఇక నిర్మాతగా సినిమాలను తగ్గించేసిన బండ్ల గణేష్ ఆ మధ్య తెలంగాణ ఎన్నికల్లో హడావిడిగా కనిపించిన విషయం తెలిసిందే. బండ్ల గణేష్ మొదటి నుంచి కూడా ఎన్నికల ప్రచారంలో జోరుగా కనిపించాడు. అయితే ఎప్పుడైతే సవాల్ విసరాడో అప్పటినుంచి మీడియా లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యాడు. ఇక ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే ఒక బ్లేడ్ తోకొసుకుంటాను అని ఒక ఇంటర్వ్యూలో విసిరిన సవాల్ ఇప్పటికి కూడా వైరల్ అవుతూనే ఉంది.

   ఆ ప్రశ్నను ఎదుర్కోకతప్పడం లేదు.

  ఆ ప్రశ్నను ఎదుర్కోకతప్పడం లేదు.

  బండ్ల గణేష్ ఎలాంటి ఇంటర్వ్యూ ఇచ్చిన కూడా ఆ ప్రశ్నను ఎదుర్కోకతప్పడం లేదు. ఇక బండ్ల గణేష్ ఆ విషయాన్ని చాలా సరదాగా తీసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఆఖరికి సరిలేరు నీకెవ్వరు సినిమా లో కూడా అదే డైలాగ్ ను మ్ చాలా కామెడీగా చేసేశాడు. ఇక మళ్లీ రాజకీయాల వైపు అడుగులు వేయనని చెప్పిన గణేష్ ఊహించని విధంగా మా ఎన్నికల్లో బరిలో నిలవడం చర్చనీయాంశంగా మారింది

   ఎన్నికల భరిలో.. జీవితపై పోటీ..

  ఎన్నికల భరిలో.. జీవితపై పోటీ..


  మొదట ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మద్దతుగా నిలిచిన బండ్ల గణేష్ ఆ తర్వాత అదే ప్యానల్ లో ఉన్నటువంటి జనరల్ సెక్రెటరీ అభ్యర్థికి పోటీగా నిలవడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో జీవిత రాజశేఖర్ పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ కారణంగా ఆమెకు పోటీగా వెళుతున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య పోటీ ఎలా సాగుతుంది? ఎవరు గెలుస్తారు? అనే విషయంపై ఫోకస్ ఎక్కువవుతుంది.

  Bigg Boss Telugu 5: Sriram Chandra - Hamida హాట్‌ హాగ్స్‌.. రొమాంటిక్ డ్యాన్సు || Oneindia Telugu
   ఈసారి ఏం కోసుకుంటారు?

  ఈసారి ఏం కోసుకుంటారు?


  అయితే గతంలో ఓడిపోతే బ్లేడుతో గొంతు కోసుకుంటారు అని చెప్పిన బండ్ల గణేష్ ఈ సారి అలాంటి అనుభవం ఎదురైతే ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారని ప్రతి మీడియా సమావేశంలో విలేకరులు కావాలని అడుగుతున్నారు. ఇక రీసెంట్ గా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆ విషయం పై బండ్ల గణేష్ కామెడీగానే స్పందించారు. గెలువకపోతే ఏం జరుగుతుంది అని ఒక విలేకరి అడగగా అలా ఎందుకు జరుగుతుంది తప్పకుండా గెలుస్తాను అంటూ బండ్ల గణేష్ సమాధానమిచ్చారు. అంతే కాకుండా గెలవక పోతే ఏం కోసుకుంటారు అని మీరు అడగాలని అనుకుంటున్నారని తనకు అర్థం అయిందని మాట్లాడిన బండ్లగణేష్ అవన్నీ అడగవద్దని ఈసారి తప్పకుండా గెలుస్తామని చెప్పారు. ఇక మీడియా మిత్రులు కూడా తనకు మద్దతు తెలపాలని వివరణ ఇచ్చారు.

  English summary
  Bandla ganesh full confidence on maa election results
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X