Don't Miss!
- News
ఎన్నికల వేళ కొత్త వరాలు - కీలక నిర్ణయాలు: నేడే ప్రభుత్వ ప్రకటన..!?
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్‌రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
10 years of Gabbar Singh డైరెక్టర్ హరీష్ శంకర్‌కు బండ్ల గణేష్ అరుదైన గిఫ్ట్.. ఖరీదు ఎంతో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత బండ్ల గణేష్ కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం టాలీవుడ్‌లో రికార్డులు తిరగరాసింది. హిందీలో దబాంగ్ చిత్ర రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా ఏపీ, నైజాంలోనే కాకుండా ఓవర్సీస్‌లో సంచలన విజయం సాధించింది. అలాంటి చరిత్ర సృష్టించిన గబ్బర్ సింగ్ మే 11వ తేదీకి 10 ఏళ్లు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్‌కు నిర్మాత బండ్ల గణేష్ అరుదైన గిఫ్టును అందించారు. ఆ గిఫ్టు ఏమిటి? దాని ధర ఏంతంటే?

బండ్ల గణేష్‌కు పవన్ బంపర్ ఆఫర్
పవన్
కల్యాణ్
నటించిన
తీన్మార్
సినిమా
ఆశించినంతగా
విజయం
సాధించకపోవడంతో
బండ్ల
గణేష్‌కు
మరో
సినిమా
నిర్మించాలని
పవన్
కల్యాణ్
ఆఫర్
ఇచ్చారు.
దాంతో
దంబాంగ్
రైట్స్‌ను
బండ్ల
గణేష్‌కు
ఇవ్వడంతో
ఆయన
హరీష్
శంకర్‌ను
రంగంలోకి
దించి
తెలుగు
ప్రేక్షకులు,
పవర్
స్టార్
అభిమానుల
అభిరుచి,
అంచనాలకు
తగినట్టుగా
స్క్రిప్టును
రెడీ
చేశారు.

మలైకా అరోరా పాట హైలెట్‌గా
గబ్బర్ సింగ్ సినిమాను 2011లో ఆగస్టు 18వ తేదీన ప్రారంభించారు. కేరళలోని పొలచ్చిలో ఈ సినిమా ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించారు. పవన్ కల్యాణ్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించారు. సుహాసిని, నాగినీడు, అభిమన్యు సింగ్, అజయ్, ఆలీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మలైకా అరోరా కెవ్వు కేక అనే స్పెషల్ సాంగ్‌లో నటించగా.. ఆ పాట సెన్సేషనల్‌గా మారింది.

30 కోట్లు పెడితే.. 150 కోట్ల లాభం
భారీ
అంచనాలతో
గబ్బర్
సింగ్
2012
మే
11వ
తేదీన
ప్రేక్షకుల
ముందుకు
వచ్చింది.
విడుదలైన
ప్రతీచోట
తొలి
ఆట
నుంచి
బ్లాక్‌బస్టర్
టాక్‌ను
సొంతం
చేసుకొన్నది.
30
కోట్లతో
రూపొందిన
ఈ
చిత్రం
ప్రపంచవ్యాప్తంగా
150
కోట్ల
గ్రాస్
కలెక్షన్లతో
సంచలన
విజయం
సాధించింది.

పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు
గబ్బర్
సింగ్
10
ఏళ్లు
పూర్తి
చేసుకొన్న
సందర్భంగా
బండ్ల
గణేష్
ఎమోషనల్
అయ్యారు.
ఎన్ని
జన్మల
పుణ్య
ఫలం
ఈ
సినిమా
నిర్మాణం..
ఈ
అవకాశం
ఇచ్చిన
మా
దేవరకు
PawanKalyan
కృతజ్ఞతలు.
బ్లాక్
బస్టర్
ఇచ్చిన
హరీష్
శంకర్‌కు
నా
ధన్యవాదములు
అని
ట్వీట్
చేశారు.
అంతేకాకుండా
హరీష్
శంకర్‌కు
గ్రాటిట్యూడ్‌గా
ఖరీదైన
వాచీని
బహుకరించారు.

హరీష్ శంకర్‌కు ఖరీదైన వాచీ
గబ్బర్
సింగ్
లాంటి
బ్లాక్‌బస్టర్
చిత్రాన్ని
అందించిన
హరీష్
శంకర్‌ను
స్వయంగా
కలిసి
ఓమెగా
కంపెనీకి
చెందిన
సీమాస్టర్
ప్రొఫెషనల్
వాచీని
బహుకరించారు.
ఈ
వాచీ
ఖరీదు
మార్కెట్లో
సుమారు
7
లక్షలకు
నుంచి
9
లక్షల
మధ్య
ఉంటుంది.
|
బండ్ల గణేష్‌కు థాంక్యూ చెబుతూ హరీష్ శంకర్
అయితే
తనకు
ఖరీదైన
వాచీని
అందించిన
బండ్ల
గణేష్‌కు
దర్శకుడు
హరీష్
శంకర్
ధన్యవాదాలు
తెలిపారు.
థ్యాంక్యూ
నా
బ్లాక్‌బస్టర్
ప్రొడ్యూసర్
బండ్ల
గణేష్.
గబ్బర్
సింగ్
నిర్మాణ
సమయంలో
అద్బుతమైన
సహకారాన్ని
అందించినందుకు
థ్యాంక్యూ.
ఎల్లప్పుడు
మీరు
నాకు
స్పెషల్.
నీవు
లేకపోతే
అంత
ఫాస్ట్‌గా
మూవీ
తియ్యడం
సాధ్యం
కాదు.
నీ
అంకిత
భావానికి
ప్రేమతో
ధన్యవాదాలు
తెలియజేసుకొంటున్నాను
అని
హరీష్
శంకర్
ట్వీట్
చేశాడు.
అందుకు
బదులుగా
బండ్ల
గణేష్
థ్యాంక్యూ
అంటూ
ట్వీట్
చేశారు.