బ్రహ్మానందాన్ని అవమానించిన బండ్ల గణేష్.. మురళీ మోహన్ సీరియస్

తెలుగు చలన పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్న టాప్ కమెడియన్, నటుడు బ్రహ్మానందంపై తాజాగా నిర్మాత బండ్ల గణేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎంతో మందికి ఆదర్శప్రాయుడైన వ్యక్తిని ఓ గౌరవ సభలో అవమానించేలా మాట్లాడటం ప్రస్తుతం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బ్రహ్మానందానికి టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ మద్దతునిచ్చారు. బండ్లా గణేష్ పై వెంటనే ఫైర్ అయ్యారు. ఇంతకీ ఎక్కడ, ఎందుకు ఇలాంటి సంఘటన జరిగిందనే వివరాల్లోకి వెళ్లితే..

ఎస్వీ కృష్ణా రెడ్డి జన్మదిన వేడుకల్లో బ్రహ్మానందం, బండ్ల గణేష్..
టాలీవుడ్ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి జన్మదిన వేడుకులను తాజాగా జూన్ 1న ఘనంగా నిర్వహించారు. 1961లో ఈస్ట్ గోదావరి జిల్లాలోని కొంకుడూరులో జన్మించిన ఆయన చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి పేరు సంపాదించారు. 1986 నుంచి దర్శకుడిగా విభిన్న చిత్రాలను ప్రేక్షకులకు అందించారకు. 32 ఏళ్లలో 42 సినిమాలను తెరకెక్కించారు. ఇక తాజాగా 64వ ఏట అడుగు పెట్టడంతో సన్నిహితులు, సినీ ప్రముఖులు ఆయనకు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, శ్రీకాంత్, బండ్ల గణేష్ హాజరయ్యారు.

Bandla Ganesh Insulted Top Comedian Brahmanandam

బ్రహ్మానందంపై బండ్ల గణేష్ అలాంటి మాటలు..
దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి జన్మదిన వేడుకల్లో ప్రముఖలు ప్రసంగించారు. ఆయనతో వారికున్న అనుబంధాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ ప్రసంగాన్ని ప్రారంభించారు. అయితే బండ్ల గణేశ్ మాట్లాడుతున్న సమయంలో కార్యక్రమానికి ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం హాజరయ్యారు. ఆయన వచ్చిన సందర్భంగా సినీ ప్రముఖులు, నటీనటులు ఆయనకు నమస్కారం చేసి గౌరవించే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే సమయంలో బండ్ల గణేశ్ ప్రసంగిస్తున్నారు.

అయితే ఎవరూ బండ్ల గణేష్ ప్రసంగాన్ని వినకపోవడంతో అందరినీ సైలెంట్ గా ఉంచే ప్రయత్నం చేశారు. తన మనస్సులోని మాట అందరూ వినాలనే ఉద్దేశంతో అందరూ సైలెంట్ గా వినాలని కోరారు. కానీ అందరూ బ్రహ్మానందం వచ్చిన సందర్భంగా గౌరవించ సాగారు. కాగా సహనం కోల్పోయిన బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈగలు వచ్చి పోతుంటాయి... పట్టించుకోవద్దని బ్రహ్మానందాన్ని ఉద్దేశించి అంటాడు. బండ్ల గణేశ్ మాటలు విన్న టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ వెంటనే సీరియస్ అవుతాడు. బ్రహ్మానందం తమ్ముడిని, ఈగ కాదు కందిరీగ అని చెబుతాడు. దాంతో బండ్ల గణేష్ కాస్తా జంకుతాడు. ఇక ఇప్పుడు గణేష్ మాటలు చర్చనీయాంశంగా మారాయి.

బ్రహ్మానందం అవార్డులు..
నటుడిగా, కమెడియన్ గా, దర్శకుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన కెరీయర్ లోనే 1400కు పైగా చిత్రాల్లో నటించిన ఎక్కువ స్క్రీన్ పై కనిపించిన నటుడిగా గిన్సీస్ వరల్డ్ రికార్డ్ ను సొంతం చేసుకున్నారు. అలాగే 6 నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. 2009లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డును స్వీకరించారు. ఇలా చాలా రికార్డులను నెలకొల్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X