Bandla Ganesh : ఎవరికైనా ఓటు వేయండి.. ఎవరు గెలిచినా పర్లేదు.. కానీ అదొక్కటి చేయండి!

ఎన్నికల డేట్ రాకముందు నుంచే వేడెక్కిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం ఇప్పుడు డేట్ కూడా ప్రకటన కావడంతో మరింత రాజుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటికే రెండు పెద్ద గ్రూపులుగా విడిపోయి రంగంలోకి దిగగా మరో సీవీఎల్ నరసింహ రావు స్వతంత్రంగా అధ్యక్ష బరిలో దిగుతున్నామని ప్రకటించారు. అయితే ప్రకాష్ రాజ్ ముందు నుంచే రంగంలోకి దిగి ప్రచారం మొదలు పెట్టగా మంచు విష్ణు కూడా ప్రచారం మొదలు పెట్టారు. మరి నేనెందుకు సైలెంట్ గా ఉండాలి అనుకున్నాడో? ఏమో? బండ్ల గణేష్ కూడా ప్రచారం మొదలు పెట్టారు, అది కూడా చాలా వినూత్నంగా. ఆ వివరాల్లోకి వెళితే

హోరాహోరీగా

హోరాహోరీగా


గత కొంతకాలం నుంచి మా ఎన్నికల వ్యవహారాల గురించి రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ను 'సినిమా బిడ్డల ప్యానల్' ప్రకటించారు. అయితే అందులో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నామని బరిలోకి దిగిన జీవిత రాజశేఖర్, హేమ కూడా ఉండటం అందరికీ షాక్ ఇచ్చింది. ఇక విష్ణు కూడా ఇప్పుడు తన సొంత ప్యానల్ ప్రకటించారు.

జీవిత దెబ్బతో

జీవిత దెబ్బతో

అయితే బండ్ల గణేష్ కు ఇస్తామని చెప్పిన జనరల్ సెక్రటరీ బరిలో జీవిత ఎంట్రీతో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బండ్ల గణేష్ బయటకు రావడం, స్వతంత్రంగా జీవిత మీద పోటీ చేస్తానని చెప్పడం, జీవిత రాజశేఖర్ ఇష్టం లేదని చెబుతూ చిరంజీవి కుటుంబ వ్యవహారాలు గుర్తు చేస్తూ కామెంట్ చేయడం దానికి జీవిత రాజశేఖర్ కూడా బండ్ల గణేష్ కామెంట్స్ మీద ఘాటు వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరింది.

అదే సమయంలో

అదే సమయంలో


ఈరోజు మంచు విష్ణు తన ప్యానల్ తో పాటు మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. మంచు విష్ణు తన ప్యానల్ గురించి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. తాను జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న సంగతి గతంలోనే ప్రకటించిన ఆయన ఇప్పుడు దానిని ఆసక్తికరంగా ప్రకటించారు.

ఎవరు గెలిచినా పర్లేదు.

మా సభ్యులు మిగతా వారిలో ఎవరు ఎవరికైనా ఓటు వేయండి.. ఎవరు గెలిచినా పర్లేదు.. కానీ జనరల్ సెక్రటరీగా మాత్రం నాకే ఓటు వేయండి అని బండ్ల గణేష్ ఒక పోస్టర్ ద్వారా ప్రక్లాటించారు. ఒకే ఒక్క ఓటు, మా కోసం మన కోసం మనందరి కోసం.. మా తరుపున ప్రశ్నించడం కోసం అంటూ పోస్టర్‌ లో పేర్కొనడం సంచలనంగా మారింది.

Recommended Video

Director Shiva Ganesh Speech At Batch Movie Trailer Launch
హీరోగా

హీరోగా

బండ్ల గణేష్ నటుడిగా కంటే కూడా నిర్మాతగానే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ భక్తుడిగా గుర్తింపు పొందారు. అయితే ఇన్నాళ్ళ పాటు నటుడిగా, నిర్మాతగా ఉన్న ఆయన.. ఇప్పుడు హీరోగా మారుతున్నాడు. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 గా స్వాతి చంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'డేగల బాబ్జీ' పేరుతొ ఈ సినిమా రూపొందుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X