ఎవడిని తొక్కాలో రవితేజకు బాగా తెలుసు.. ధమాకా సక్సెస్ మీట్‌లో బండ్ల గణేష్ పవర్‌ఫుల్ స్పీచ్ ఇదే..

మాస్ మహారాజా రవితేజ, హీరోయిన్ శ్రీలీల జంటగా త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన చిత్రం ధమాకా. ఈ సినిమా తొలి రోజు నుంచి భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఇప్పటికే 50 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ మాస్ మీట్ పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా బండ్ల గణేష్ చేసిన ప్రసంగం సెన్సేషనల్‌గా మారింది. ఆ స్పీచ్ వివరాల్లోకి వెళితే..

70 సినిమాలు.. 12 మంది కొత్త దర్శకులు

70 సినిమాలు.. 12 మంది కొత్త దర్శకులు


ధమాకా సక్సెస్ మీట్ మాస్ మీట్‌కు నేను ఫోన్ చేసి.. నేను వస్తానని వచ్చాను. అస్తమించిన రవిని చూశాం. ఎప్పటికీ అస్తమించని రవితేజను గురించి మాట్లాడుదామని వచ్చాను. రవితేజ ఎప్పటికీ వెలుగునిచ్చే సూర్యుడు. రవితేజ హానెస్టీ. సిన్సియారిటీ, రెస్పాన్సిబులిటీ, రవితేజ ఎవ్రీ థింగ్ ఫర్ అన్సరబులిటీ. రవితేజ ఫ్యాన్స్‌గా చెప్పుకోవాలంటే గర్వంగా ఉండాలి. ఆయన చేసిన 70 సినిమాలకు 12 మంది కొత్త దర్శకులను పరిచయం చేసిన ఏకైక హీరో రవితేజ అని బండ్ల గణేష్ అన్నారు.

తనకుతాను ఎదుగుతూ.. వందల మందికి ప్రోత్సాహం

తనకుతాను ఎదుగుతూ.. వందల మందికి ప్రోత్సాహం


కష్టం తెలిసిన హీరో రవితేజ. ధమాకా చిత్రంలో ఒక డైలాగ్ ఉంది. నాకు వెనుక ముందు లేకుండా ఎలా పైకి రావాలో అని చెప్పాడు. ఆ డైలాగ్ 100 శాతం కరెక్ట్. అందరూ ఒక సంవత్సరం ట్రై చేస్తారు. ఒకరు రెండేళ్లు, మూడేళ్లు ప్రయత్నిస్తారు. అదృష్టం కలిసి సూపర్‌స్టార్లు, మెగాస్టార్లు అవుతారు. కానీ ఆఖరుకు ప్రొడక్షన్ కానీ, అసిస్టెంటు డైరెక్టర్ కానీ.. నేను చచ్చిపోవడం సినిమా పరిశ్రమలోనే అని.. తన లక్ష్యాన్ని, కోరిక తీర్చుకొన్న వ్యక్తి రవితేజ. సినీ పరిశ్రమలో తనకుతాను ఎదుగుతూ వందల మందికి అవకాశాలు ఇచ్చిన వ్యక్తి రవితేజ అని బండ్ల గణేష్ తెలిపారు.

నల్లమల్ల అడవిలో నల్లత్రాచులా

నల్లమల్ల అడవిలో నల్లత్రాచులా


రవితేజ ఓ ఇన్సిపిరేషన్. ఇంట్రిగిటీ, రాయల్టీ, రియాలిటీ, రాజసం.. రవితేజ అరాచకం. ఈ సినిమాతో రవితేజ అయిపోతాడు.. అయిపోతాడు అని చాలా మంది అనుకొంటారు. దేవుడు నవరంధ్రాలు ఇచ్చారు. ముందు కళ్లు తెరుచుకొని ఉండండి. వెనుక మూసుకొని ఉండండి. ఎందుకంటే.. ఆయన అయిపోవడం ఉండదు. ఈ సినిమాకు ప్రసన్న అద్భుతమైన డైలాగ్స్ రాశారు. నల్లమల్ల అడవుల్లో నల్లత్రాచును వదిలితే.. ఎలా ఉంటుందో.. రవితేజ కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ అలా ఉంటుంది అని బండ్ల గణేష్ ప్రశంసలతో ముంచెత్తారు.

20 ఏళ్ల క్రితం కంటే మరింత అందంగా

20 ఏళ్ల క్రితం కంటే మరింత అందంగా


రవితేజను వెనుక నుంచి చూస్తే వెంకటేశ్వరస్వామి.. ముందునుంచి చూస్తే పరమేశ్వరుడు. ఆయనను చూస్తే.. రోజు రోజుకు కుర్రాడు అయిపోతున్నట్టు అనిపిస్తాడు. 20 ఏళ్ల కింద చూసిన దానికంటే ఎక్కువ అందంగా ఉన్నాడు. నల్లత్రాచులా నిగనిగలాడాడు. ధమాకా సినిమా చూస్తే.. అర్జెంటీనా గోల్ కొడితే.. విరాట్ కోహ్లీ సిక్స్ కొడితే అలా ఉంది. రవితేజ వన్ మ్యాన్ ఆర్మీగా ధమాకాను ముందుకు తీసుకెళ్లారు అని బండ్ల గణేష్ చెప్పారు.

హరీష్ శంకర్‌ ఫ్లాప్ ఇస్తే.. మరో అవకాశం

హరీష్ శంకర్‌ ఫ్లాప్ ఇస్తే.. మరో అవకాశం


రవితేజ క్యారెక్టర్ ఎలాంటిది.. నీవు గొప్ప ఏమిటంటే?. నీకు టచప్ మ్యాన్‌గా వచ్చిన సీను ఇంకా నీతోనే ఉన్నాడు. అదీ నీ గొప్పతనం. ఎవడైనా ఫ్లాప్ ఇస్తే.. హరీష్ శంకర్ షాక్ సినిమాతో ఫ్లాప్ ఇస్తే.. మళ్లీ పిలిచి మిరపకాయ్ లాంటి సినిమా అవకాశం ఇచ్చాడు. దటీజ్ రవితేజ. నమ్మకం ఆయన పెట్టుబడి. కసి ఉంటే ఎవడికైనా అవకాశం ఇస్తాడు. కథ చెబుతానంటే. డైరెక్షన్ అవకాశం ఇస్తాడు. ఎవడి జాతకాలను.. ఎలా మార్చాలో.. ఎవడిని పైకి లేపాలో.. ఎవడిని తొక్కాలో ఆయనకే తెలుసు. రవితేజ రియల్ కింగ్. అందర్నీ మరిచిపోయానా నన్ను మరిచిపోవద్దు అని బండ్ల గణేష్ అన్నారు.

100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుంది అంటూ

100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుంది అంటూ


ధమాకా సినిమా రవితేజ తప్ప ఎవడు చేసినా అట్టర్ ఫ్లాప్. రవితేజ తప్ప ఈ కథను ఎవడైనా సింగిల్ షో మాత్రమే. రవితేజ కాకుండా ఎవడితోనైనా ఈ సినిమా తీస్తే.. మటాష్. సింగిల్ షో .. సింగిల్ ఆట. రవితేజ పవర్ ఎందంటే.. ధమాకా సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుంది అని నిర్మాత

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X