‘రాసిపెట్టుకోండి.. ఇండస్ట్రీలో మరో అల్లు అర్జున్ అతడే.. ’యంగ్ హీరోపై బండ్ల గణేష్ కామెంట్స్

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన మనసులోని మాటను ఏ మాత్రం భయపడకుండా బయటపెట్టే వ్యక్తుల్లో ఆయన ముందుంటాడు. అందుకే కొంతమంది స్నేహితులను కోల్పోయినా, తన ధోరణిని మాత్రం మార్చుకోలేదు. ఒకప్పుడు నిర్మాతగా బిజీగా ఉన్న బండ్ల గణేష్ గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉంటూ, మీడియా ముందు అప్పుడప్పుడూ మాత్రమే కనిపించారు. తాజాగా మరోసారి తన వ్యాఖ్యలు, పనులతో వార్తల్లో నిలిచారు బండ్ల గణేష్. ఎవరిని ఏమన్నారు? ఎవరిపై కామెంట్స్ చేశారు?

కొంతకాలంగా సినీ రంగానికి దూరంగా బండ్ల గణేష్ మరోసారి నిర్మాతగా రీఎంట్రీ ఇవ్వడానికి ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో టాక్. ఈ నేపథ్యంలో తన ఇంట దీపావళి సంబురాలను ఘనంగా నిర్వహించారు. మరోసారి ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. శనివారం రాత్రి జరిగిన దీపావళి వేడుకకు సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjivi)ముఖ్య అతిథిగా విచ్చేయడం హైలైట్‌. చిరంజీవి కారు దిగగానే బండ్ల గణేష్ ఆయన కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు తీసుకోవడం, చేతి పట్టుకొని లోపలికి తీసుకెళ్లి ప్రత్యేకంగా కూర్చోబెట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది.

Bandla Ganesh Praises Teja Sajja

బండ్ల గణేష్ ఏర్పాటు చేసిన దీపావళి వేడుకలో ఇండస్ట్రీ ప్రముఖులు ఒకేచోట చేరి సందడి చేశారు. ఈ వేడుకలో విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్, సిద్ధు జొన్నలగడ్డ, తేజ సజ్జా, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై ఈ వేడుకను మరింత గ్రాండ్‌గా మార్చారు. ఈ పార్టీలో యంగ్ హీరో తేజ సజ్జా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఆయన రాగానే చాలామంది 'మిరాయ్' సినిమా సక్సెస్‌కి శుభాకాంక్షలు తెలిపారు. లోపలికి వెళ్లిన తేజ సీనియర్లను ఆప్యాయంగా పలకరించగా, బండ్ల గణేష్ అతడిని ప్రత్యేకంగా పక్కకు తీసుకెళ్లి ఫోటోలు దిగాడు.

తేజ సజ్జాపై బండ్ల గణేష్ కామెంట్స్
ఈ సందర్భంలో యంగ్ హీరో తేజ సజ్జాపై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. "రాసిపెట్టుకోండి... తేజ భారత సినీ ఇండస్ట్రీలో మరో అల్లు అర్జున్ కాకపోతే నన్ను అడగండి!" అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లలో చర్చనీయాంశంగా మారింది. 'హనుమాన్', 'మిరాయ్' వంటి హిట్లతో పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకున్న తేజపై బండ్ల ప్రశంసలు యువ హీరోకి మరింత బూస్ట్ ఇచ్చాయనే చెప్పాలి. తేజా సజ్జాతో బండ్ల గణేష్ ఏదైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

బండ్ల గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. 'లిటిల్ హార్ట్స్' సక్సెస్ మీట్‌లో ఆయన "ఇండస్ట్రీ మాఫియా" అంటూ చేసిన వ్యాఖ్యలు అల్లు అరవింద్ సహా పలువురిని షాక్‌కు గురిచేశాయి. ఆ ఘటన తర్వాత అల్లు ఫ్యామిలీతో ఆయన సంబంధాలు దెబ్బతిన్నాయని టాక్. అందుకే ఈ పార్టీకి అల్లు అరవింద్ ఆహ్వానించబడలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీపావళి పార్టీతో బండ్ల గణేష్ మళ్లీ ఇండస్ట్రీలో చురుకుగా మారడానికి మొదటి అడుగు వేసినట్టే కనిపిస్తోంది. తన ఫ్రెండ్‌సర్కిల్‌ను రీ-కనెక్ట్ చేసుకుంటూ, సీనియర్లతో మమేకం అవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X