రీ ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్.. మహేశ్‌తో కలిసి వర్క్.. మలుపు తిప్పేస్తాడట

తన గత చిత్రం 'మహర్షి' సక్సెస్‌తో మాంచి జోష్ మీద ఉన్నాడు సూపర్‌స్టార్ మహేశ్ బాబు. ప్రస్తుతం అతడు నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ చిత్రాన్ని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా, ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ వచ్చేసింది. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ద్వారా సీనియర్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో ఆయన కోసం దర్శకుడు ప్రత్యేకమైన పాత్రను రాశాడని సమాచారం. అది కథను మలుపు తిప్పుతుందని అంటున్నారు.

 Bandla Ganesh re entry through mahesh Sarileru Neekevvaru

ఇందుకోసం గణేష్.. సోమవారం నుంచి షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో నటించడానికి ఆయన భారీ మొత్తం చార్జ్ చేస్తున్నారని ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి బండ్ల గణేష్ నటనకు దూరమై ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు.

అయితే, కొద్దిరోజుల క్రితం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం.. ఆ తర్వాత ముందస్తు ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడంతో ఆయన రాజకీయాలకు దూరమైపోయారు. ఎన్నికల సమయంలో బండ్ల గణేష్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే.. సెవెన్ ఓ క్లాక్ బ్రేడుతో గొంతు కోసుకుంటానని చెప్పడం అప్పట్లో సంచలనం అయింది. ఆ సమయంలో ఆయనపై విమర్శలు కూడా అదే స్థాయిలో వచ్చాయి.

ఇప్పుడు మహేశ్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి 'బిజినెస్‌మ్యాన్'లో నటించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మహేశ్ బాబు ఆర్మీ మేజర్‌లా కనిపించనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X