సౌందర్య చనిపోయిన రోజు .. ఆ పెద్ద మనిషి చెప్పుతో కొట్టాడు

సినీ పరిశ్రమలో స్టార్‌గా ఎదగడం అంత సులభం కాదు. ప్రతి విజయానికి వెనుక ఎన్నో అవమానాలు, కష్టాలు, పోరాటాలు దాగి ఉంటాయి. అలాంటి కఠినమైన ప్రయాణం నుంచే పైకి వచ్చిన వారిలో బండ్ల గణేశ్(Bandla Ganesh) ఒకరు. కామెడీ పాత్రలతో తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన, తరువాత కాలంలో కోట్ల బడ్జెట్ సినిమాలను నిర్మించే స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను ఈ స్థాయికి చేరుకునేందుకు ఆయన ఎదుర్కొన్న అవమానాలు, బాధలను వెల్లడించారు.

సీనియర్ నటుడు రాజా రవింద్ర (Raja Ravindra) నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న బండ్ల గణేష్.. తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని సంఘటనలను బయటపెట్టారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న అవమానాల గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "ఈ ప్రపంచంలో డబ్బు ఉంటేనే గౌరవం ఉంటుంది.. లేకపోతే మనిషిని జీరోగా చూస్తారు" అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Bandla Ganesh Reveals Shocking Incident Slapped With Shoe Turned It Into Success Story

అలా ఈ సందర్బంగా బండ్ల గణేష్ అత్యంత షాకింగ్ సంఘటన బయటపెట్టారు. తనను ఒక పెద్ద వ్యక్తి చెప్పుతో కొట్టిన ఘటనను బయటపెట్టారు. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ ఆయన ఇలా చెప్పారు.'ఒక రోజు తాను సెట్స్ వద్ద కూర్చుని ఉండగా, ఎలాంటి కారణం లేకుండా ఒక ప్రముఖ వ్యక్తి కోపంతో తనను చెప్పుతో కొట్టాడని తెలిపారు. అదే రోజు ప్రముఖ నటి సౌందర్య (Soundarya)హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన రోజు అని చెప్పారు. ఆ సంఘటన తన మనసులో గాఢంగా ముద్ర వేసిందని పేర్కొన్నారు.

"ఆ సమయంలో నాకు పెద్దగా పని ఉండేది కాదు. సెట్స్‌కి వెళ్లి కూర్చోవడం, అందరితో మాట్లాడటం మాత్రమే చేసేవాడిని. అలానే ఆ రోజు కూడా వెళ్లి కూర్చున్నా. కానీ ఒక్కసారిగా ఆయన చెప్పు తీసుకొని నన్ను కొట్టాడు. నాకు ఏమాత్రం సంబంధం లేకపోయినా ఆ అవమానం ఎదురైంది" అని ఆయన వివరించారు. ఈ ఘటన తన జీవితంలో పెద్ద మలుపుగా మారిందని కూడా చెప్పారు.

అయితే అదే వ్యక్తి గురించి చెబుతూ బండ్ల గణేష్ మరో కోణాన్ని కూడా వెల్లడించారు. 'ఆయన చాలా మంచి మనిషే. నాకు తర్వాత చాలా సహాయం కూడా చేశాడు. ఆ రోజు ఆయన ఏదో వ్యక్తిగత టెన్షన్‌లో ఉండి అలా ప్రవర్తించాడు. మరుసటి రోజే నన్ను పిలిచి క్షమాపణలు కూడా చెప్పాడు' అని తెలిపారు. అయినప్పటికీ, ఆ క్షణంలో తాను అనుభవించిన అవమానం మాత్రం తనను లోపల నుంచి కుదిపేసిందని అన్నారు.

ఈ సంఘటనను తాను జీవితానికి ఒక పెద్ద పాఠంగా తీసుకున్నట్లు బండ్ల చెప్పారు. 'మనుషులకు కోపం వస్తే, వారు విలువలేని వస్తువులను పగలకొడతారు. అదే విధంగా, మనకంటే బలహీనుడిగా కనిపించిన వ్యక్తిపైనే తమ ప్రతాపం చూపిస్తారు. ఆ రోజు నేను ఆయనకు బలహీనమైన వ్యక్తిలా కనిపించాను. ఈ అవమానం తర్వాత తనలో ఒక కొత్త నిర్ణయం పుట్టిందని ఆయన గుర్తు చేసుకున్నారు.

"అక్కడి నుంచి బయటకు వచ్చి నా పక్కన ఉన్న వ్యక్తితో చెప్పాను. నా దగ్గర డబ్బు లేదనే కారణంతోనే ఆయన నన్ను ఇలా అవమానించాడు. నేను ఆయనకంటే ఎక్కువ సంపాదించి చూపిస్తా.. లేకపోతే నా పేరు గణేష్ కాదు' అని అన్నానని చెప్పారు. అదే తన జీవితంలో టర్నింగ్ పాయింట్‌గా మారిందని, ఆ కోపమే తనను ఎదగడానికి ప్రేరణ ఇచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ పెద్ద మనిషి ఎవరంటూ కామెంట్స్ చేసున్నారు నెటిజన్లు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X