Bandla Ganesh: నౌహీరా షేక్‌పై బండ్ల గణేష్ రౌడీయిజం.. వీడియో వైరల్!

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ ఎవరో ఒకరిపై షాకింగ్ కామెంట్లు చేస్తూ... సెన్సేషన్ క్రియేట్ చేసే ఈయన తాజాగా ఈ వివాదంలో ఇరుక్కున్నారు. ఇటీవలే ఈయనపై ఓ కేసు నమోదు కాగా.. తాజాగా మరో గొడవలో ఇరుక్కుపోయారు. ముఖ్యంగా హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఎండి నౌహీరాషేక్‌ పై తాజాగా రౌడీయిజం చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు వీడియోలో ఏముందంటే?

ఈ వీడియోలో నౌహీరా షేక్ తో పాటు మరికొంత మంది బండ్ల గణేష్ ఇంట్లోకి వెళ్లి నెమ్మదిగా మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే అక్కడే ఉన్న బండ్ల గణేశ్ అసిస్టెంట్ నౌహీరాపై, ఆమెతో వచ్చిన మరికొంత మందిపై వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగగా.. నౌహీరా షేక్ నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఇంతలోనే బండ్ల గణేశ్ మరింత ఫైర్ అయ్యాడు. నౌహీరా అన్నా వద్దు, మెల్లిగా మాట్లాడుకుందాం అంటూ చెప్పినా వినకుండా గొడవ పడ్డారు.

Bandla Ganesh Rouwdyism on Nowhera Shaikh Video Goes Viral Check Details

వాస్తవానికి ఈ గొడవ శనివారం రోజు జరగ్గా.. వీడియో మాత్రం ఆదివారం రోజు వైరల్ అయింది. ఈక్రమంలోనే నౌహీరా షేక్ వెలుగులోకి వచ్చి అసలు విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా తన ఇంటికి అద్దెకు తీసుకున్న బండ్ల గణేష్.. ఇప్పుడు తన ఇంటిని పూర్తిగా కాజేసేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు. ఇది అడిగేందుకు వెళ్లిన తనపై బండ్ల గణేష్ తన రౌడీలతో బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లోని తన కార్యాలయంలో నౌహీరా షేక్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ వివరాలు వెల్లడించారు. రూ.75 కోట్ల విలువ చేసే తన ఇంటిని కబ్జా చేయాలని స్కెచ్ వేశారని నౌహీరా షేక్ ఆరోపించారు.

రూ.75 కోట్ల విలువైన తన ఇంట్లోని ఫస్ట్ ఫ్లోర్ ను బండ్ల గణేష్ కు అద్దెకు ఇచ్చామని నౌహీరా షేక్ తెలిపారు. 2021 జూన్ 5వ తేదీన బండ్ల గణేష్ కు అద్దెకు ఇచ్చామని ఇందుకు గానూ తాము 11 నెలలకు రెంట్ అగ్రిమెంట్ కూడా చేశామని చెప్పారు. అగ్రిమెంట్ గడువు ముగిసినా తన ఇంటిని ఖాళీ చేయకపోగా, సదరు ప్రాపర్టీ ఈడీ అధికారులు అటాచ్ చేశారన్న విషయం తెలుసుకుని ఆ ఇంటిని కబ్జా చేసేందుకు ప్లాన్ చేశారని బండ్ల గణేష్ పై నౌహీరా షేక్ ఆరోపణలు చేశారు. 11 నెలల పాటు చేసుకున్న రెంటల్ అగ్రిమెంట్ ను ఫోర్జరీ చేసి 9 ఏళ్లు అద్దెకు తీసుకున్నట్లు మార్చారని ఆరోపణలు గుప్పించారు.

Bandla Ganesh Rouwdyism on Nowhera Shaikh Video Goes Viral Check Details

ఈ విషయంపై తేల్చుకునేందుకు తమ ఇంటికి వెళ్లగా.. తాము అక్కడ ఉండగానే పోలీసులు వచ్చి కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు తెలుసంటూ బండ్ల గణేశ్‌ తమముందే ఫోన్‌లు చేశాడన్నారు. ఇంటిపై 11 నెలల రెంట్‌ అగ్రిమెంట్‌ను బండ్ల గణేశ్‌ ఫోర్జరీ చేశాడని, దీనిపై తమకు సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఫిలింనగర్‌ పోలీసుల తీరుపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్టు పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X