ఒకే ప్లేస్‌, ఒకే లొకేషన్‌, ఒకే యాక్టర్‌తో డేగల బాబ్జీ.. బండ్ల గణేష్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

తెలుగు స్క్రీన్ మీద తొలిసారి సింగిల్ యాక్టర్‌తో చేసిన సినిమా డేగల బాబ్జీ. ఒకే ప్రదేశంలో, ఒకే లొకేషన్‌లో, ఒక్క వ్యక్తి మాత్రమే సినిమా అంతా కనిపిస్తాడు. ఇంకా ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్లు ఉన్నా..కూడా వాళ్ల వాయిస్ మాత్రమే వినిపిస్తుంది తప్ప మనుషులు కనిపించరు. తమిళంలో నేషనల్ అవార్డ్ పొందిన "ఉత్త సిరుప్పు సైజు 7" చిత్రాన్ని తెలుగులో .ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్‌ను హీరోగా పరిచయం చేస్తూ తీసిన చిత్రమే 'డేగల బాబ్జీ'. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ... రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 20 తేదీన గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సందర్భంగా

హీరో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ఒక రూమ్ లో ఒక సినిమాని రెండు గంటల సేపు ఒక క్యారెక్టర్ చేయడం అనేది చాలా రిస్క్. అలాంటి కథను నా భుజాన పెట్టి నాతో చేయించాడు దర్శకుడు వెంకట్ చంద్ర.ఈ సినిమా నిజంగా నా జీవితానికి అర్థం చెప్పే సినిమా అవుతుంది.ఈ సినిమా తర్వాత నాకు ప్రేక్షకులనుండి మంచి రెస్పెక్ట్ వస్తుంది. ఈ రెస్పెక్ట్ కోసమే నేను 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. సంగీత దర్శకుడు లైనస్ అద్భుతమైన మ్యూజిక్,రీ రికార్డింగ్ ఇచ్చాడు..తమిళ్ లో పార్థీబన్ అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేసి నేషనల్ అవార్డు సాధించిన "ఉత్త సిరుప్పు సైజు 7" సినిమాను తెలుగులో నేను చెస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా చిత్రానికి సపోర్ట్ చేస్తూ ట్రైలర్, పోస్టర్ ను విడుదల చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి,హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు. మే 20 న వస్తున్న ఈ సినిమాను మీరందరూ ఆదరించి ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను అన్నారు

Bandla Ganeshs degala babji set to release on May 20th.

దర్శకుడు వెంకట్ చంద్ర గారు మాట్లాడుతూ ..బండ్ల గణేష్ ఈ సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మన్స్ చేశాడు.సినిమా విడుదలైన తర్వాత బండ్ల గణేష్ ఇంత బాగా నటించగలుగుతాడా అనేది సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతారు. లైనస్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. మే 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను అన్నారు.

Bandla Ganeshs degala babji set to release on May 20th.

డేగల బాబ్జీ చిత్రానికి
ఆర్ట్స్: గాంధీ
కూర్పు: ఎస్బీ ఉద్దవ్
సినిమాటోగ్రఫి: అరుణ్ దేవినేని
కథ: ఆర్. పార్తిబన్
మాటలు: మరుధూరి రాజా, వైదేహి
సంగీతం: లైనస్ మధిరి
సమర్పణ: రిషి అగస్త్య
నిర్మాణ సంస్థ: యష్ రిషి ఫిలిమ్స్
దర్శకత్వం: వెంకట్ చంద్ర
నిర్మాణం: స్వాతి చంద్ర
పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X