చిరంజీవి ఫోన్ చేశారు.. పవన్ కళ్యాణ్ చేయలేదు.. కరోనా సమయంలో బండ్ల గణేష్ మెనూ ఇదే!

టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి బడా నిర్మాతగా ఎదిగాడు బండ్ల గణేష్. దాదాపు మూడు దశాబ్దాల కెరీర్‌లో నటుడిగా ఎన్ని పాత్రలు చేసినా.. నిర్మాతగానే ఎక్కువగా పాపులర్ అయ్యాడు. బడా స్టార్లతో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నాడు. గబ్బర్ సింగ్ సినిమాతో బడా నిర్మాతగా మారిపోయాడు. అయితే మధ్యలో రాజకీయ ప్రవేశం చేశాడు. అక్కడ ఎదురుదెబ్బలు తగలడంతో మళ్లీ సినీ పరిశ్రమ వైపు వచ్చేశాడు. ఈ మధ్య బండ్ల గణేష్‌కు కరోనా సోకడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. అయితే ఆయన కరోనా నుంచి కోలుకొని బయటపట్టాడు. తాజాగా ఆయన ఓ వెబ్ సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించాడు.

మొదటిసారిగా భయమేసింది..

మొదటిసారిగా భయమేసింది..

తాను హెయిర్ ప్లాంటేషన్ కోసం హాస్పిటల్‌కు వెళ్లానని అక్కడ డాక్టర్ అన్ని పరీక్షలు చేయగా.. కరోనా కూడా చేద్దామని సూచించారు. అయితే తనకు కరోనా ఎందుకు వస్తుందన్న ధీమా ఉండేదని కాని పాజిటివ్ అని చెప్పాక.. జీవితంలో మొదటి సారి భయమేసిందని చెప్పుకొచ్చాడు.

ఇండస్ట్రీ నుంచి పరామర్శలు..

ఇండస్ట్రీ నుంచి పరామర్శలు..

తనకు కరోనా సోకిందని తెలిసిన వెంటనే ఇండస్ట్రీ నుంచి చాలామంది ఫోన్ చేశారని, అందరిలోనూ దర్శకుడు మారుతి చేయడం సంతోషంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు. తనతో ఎలాంటి సంబంధం లేకపోయినా మారుతి చేయడం ఎంతో నచ్చిందని పేర్కొన్నాడు. చిరంజీవి ఫోన్ చేసి పది నిమిషాలు మాట్లాడాడని, మోహన్ బాబు సైతం ఫోన్ చేశారని పేర్కొన్నాడు.

పవన్ కళ్యాణ్ చేయలేదు..

పవన్ కళ్యాణ్ చేయలేదు..

పవన్ కళ్యాణ్ తనకు ఫోన్ చేయలేదని, అయితే ఆయనకు ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చని పేర్కొన్నాడు. అలా అని తాను అనుకుంటేనే తృప్తిగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. అయినా ఎవరి బిజీ, పనులు వారికి ఉంటాయని, ఎవరైనా ఎందుకు చేయాలని ప్రశ్నించాడు.

Recommended Video

Bandla Ganesh కు Coronavirus పాజిటివ్..టెన్షన్ లో Tollywood!
మెనూ ఇదే..

మెనూ ఇదే..

కరోనా వస్తే భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. తాను మొదట్లో భయపడ్డానని తెలిపాడు. అయితే రోజు గుడ్లు, శొంఠి, అల్లం, వెల్లుల్లి, వేడి నీళ్లు తీసుకోవాలని పేర్కొన్నాడు. తనకు కరోనా 12 రోజుల్లో నెగెటివ్ అని వచ్చిందని, రోజకు 7 గుడ్లు తినేవాడినని, శొంఠి రసం తాగేవాడినని చెప్పుకొచ్చాడు. కరోనాను ఈజీగా జయించవచ్చని, హాస్పిటల్‌కు వెళ్లి లక్షలకులక్షలు ఖర్చు పెట్టాల్సిన పని లేదని తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X