Telangana Election Results కేసీఆర్, కేటీఆర్ అహంకారానికి చెంపపెట్టు.. భయంతో బతికాం.. బండ్ల గణేష్

తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం వైపు దూసుకెళ్తున్న నేపథ్యంలో సినీ నిర్మాత బండ్ల గణేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మార్పు కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలకు ప్రజలు అండగా నిలిచారని ఆయన అన్నారు. ఈ విజయం ఊహించినదేనని ఆయన వ్యాఖ్యానించారు. మీడియా డిబేట్‌లో ఆయన మాట్లాడుతూ..

కేసీఆర్ కుటుంబ అహంకారానికి చెంపపెట్టు. కేసీఆర్‌ను విమర్శించే స్థాయి నాకు లేదు. కానీ కేటీఆర్ వ్యవహరించిన తీరు చాలా అభ్యంతరకరం. ఆయన అహంకార తీరుకు ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు అని బండ్ల గణేష్ అన్నారు.

Bandla Ganesh sensational Comments on KCR, KTR says slipper shot by people in Telangana Elections

తెలంగాణ ఏర్పాటు తర్వాత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అనుక్షణం భయంతో బతికాం. పోలీసు అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తలుగా వ్యవహరించారు. పోలీసుల తీరుతో అనుక్షణం భయంతో జీవితాన్ని గడిపాం. ఈ రోజు మాకు విముక్తి కలిగింది అని బండ్ల గణేష్ చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలం సోనియా గాంధీ వల్లే జరిగింది. ఆమె ఆశించిన విధంగా తెలంగాణలో ప్రజా సంక్షేమం జరుగలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలిచారు. తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్ రెడ్డి అని బండ్ల గణేష్ జోస్యం చెప్పారు

కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఎన్నికల పోలింగ్ ముందు నుంచి చెబుతున్నాను. ఈ రోజు అదే జరిగింది. డిసెంబర్ 9వ తేదీన జరిగే ప్రమాణ స్వీకారం కోసం 7వ తేదీనే ఎల్బీ స్టేడియంకు వెళ్తున్నాను. మాట తప్పేది లేదు అని బండ్ల గణేష్ పేర్కొన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తున్న నేపథ్యంలో భారీగా బాణాసంచాను పేల్చేందుకు ఆయన సిద్దమయ్యారు. బాణసంచా సిద్దం చేసుకొన్న ఫోటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X